Terrorists Attack: కొలంబియాలో సైనికులే లక్ష్యంగా తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారు. బుధవారం మిలిటెంట్లు జరిపిన ఈ దాడుల్లో తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కొలంబియా, వెనిజులా దేశ సరిహద్దు వద్ద ఉన్న సమస్యాత్మక ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ దాడిని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఖండించారు.
Read Also: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
ఈ కాల్పుల ఘటనకు నేషనల్ లిబరేషన్ ఆర్మీ లేదా ఈఎల్‌ఎన్ గెలిల్లా గ్రూప్ కారణమై ఉండొచ్చని ఆ దేశ భద్రతా అధికారులు భావిస్తున్నారు. ఆ తీవ్రవాదుల కోసం ఆపరేషన్‌ను కొనసాగిస్తామని కొలంబియా మిలిటరీ కమాండర్ ప్రకటించారు. ప్రభుత్వానికి, రివల్యూషనరి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియాకి మధ్య 2016లో చారిత్రాత్మక ఒప్పందం జరిగినప్పటికీ.. కొలంబియాలోని కొన్ని ప్రాంతాలు డ్రగ్స్ గ్యాంగ్, రెబల్ గ్రూప్‌ల ఆధీనంలోనే ఉన్నాయి.