Site icon NTV Telugu

Earthquake: హర్యానాలో భూకంపం… ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వల్ప ప్రకంపనలు

Earthquake

Earthquake

Earthquake: మంగళవారం (జులై 22) ఉదయం ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని స్వల్పంగా భూకంపం కంపించిం‍ది. స్వల్పంగా కంపనలు గుర్తించినప్పటికీ, ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (National Centre for Seismology) విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఉదయం 6 గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ భూకంపానికి హర్యానాలోని ఫరిదాబాద్ ప్రాంతం కేంద్రంగా నమోదైంది.

Delivery Agent Urinates: లిఫ్ట్‌లో మూత్రవిసర్జన చేసిన డెలివరీ ఏజెంట్‌.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. చివరకి..?

భూకంపం కేంద్ర బిందువు అక్షాంశం 28.29 డిగ్రీలు ఉత్తరంగా, రేఖాంశం 72.21 డిగ్రీలు తూర్పుగా నమోదు అయింది. భూమి ఉపరితలానికి 5 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. భూకంపం వల్ల ఎక్కడా ప్రజలందరిలో ఆందోళన లేనప్పటికీ, కొద్దిసేపు ఇంటి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రకంపనలు తక్కువ తీవ్రత కలిగి ఉండటంతో ఏవిధమైన నష్టం సంభవించలేదు. సాధారణంగా 3.0 – 4 తీవ్రతకు సంబంధించిన భూకంపాలు సురక్షితమైనవే కావడంతో అధికారులు ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

Hyderabad Rain Alert: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ

Exit mobile version