Site icon NTV Telugu

MiG-21 Success Story: పాక్ అహాన్ని, అమెరికా గర్వాన్ని బద్ధలు కొట్టిన ఫైటర్ జెట్..

Mig 21

Mig 21

MiG-21 Success Story: అది 1971, డిసెంబర్ 4వ తేదీ రాత్రి జామ్‌నగర్ ఆకాశంలో భారతదేశం.. పాకిస్థాన్ అహాన్ని, అమెరికా గర్వాన్ని బద్దలు కొట్టిన రోజు. ఇంతకీ ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా.. అమెరికా 1962లో పాకిస్థాన్‌కు F-104 స్టార్‌ ఫైటర్లను బహుమతిగా ఇచ్చి భారతదేశం అభ్యర్థనను తిరస్కరించింది. అగ్రరాజ్యం భారతదేశానికి చేసిన గాయాన్ని తొమ్మిదేళ్ల తర్వాత మిగ్-21 క్షిపణి నయం చేసింది. జామ్‌నగర్ ఆకాశంలో ఈ రోజు భారత్ తొలిసారిగా మిగ్-21 క్షిపణి ప్రయోగించింది. ఇక అప్పుడు మొదలైంది భారత్ నూతన చరిత్ర. ఈ విజయం భారత్‌కు ఎనలేని శక్తిని ఇచ్చినట్లు అయ్యింది.

READ ALSO: దివ్య భారతి బోల్డ్ లుక్..ఆరెంజ్ డ్రెస్ లో అదరగొట్టిన అందం

పాక్‌కు అమెరికా F-104 స్టార్‌ఫైటర్ గిఫ్ట్..
1962 లో అమెరికా పాకిస్థాన్‌కు F-104 స్టార్‌ఫైటర్ వంటి హైటెక్ ఫైటర్ జెట్‌లను బహుమతిగా ఇచ్చింది. ఈ జెట్‌లను కొనుగోలు చేయాలనే కోరికను అగ్రారాజ్యం ముందు భారతదేశం వ్యక్తం చేసింది. కానీ అమెరికా దానిని పూర్తిగా తిరస్కరించింది. దీంతో భారతదేశం సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) వైపు తిరిగి మిగ్-21ను తన వైమానిక దళంలోకి చేర్చుకుంది. ఈ మిగ్-21 ఆ కాలంలో సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్. అది తరువాత కాలంలో చరిత్రకు తార్కాగణంగా నిలిచి సరి కొత్త చరిత్రను సృష్టించింది.

1971 యుద్ధంలో MiG-21 vs F-104..
అది 1971లో భారతదేశం – పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. భారత వైమానిక దళం 47వ స్క్వాడ్రన్, “బ్లాక్ ఆర్చర్స్”, గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్‌ను రక్షించే బాధ్యతను తీసుకుంది. ఈ స్క్వాడ్రన్ MiG-21 ఫైటర్ జెట్‌లు ఏవిధమైన శత్రువు దాడినైనా అడ్డుకోవడానికి సిద్ధంగా ఆకాశంలో గస్తీ తిరుగుతున్నాయి. అదే సమయంలో జామ్‌నగర్ ఎయిర్‌బేస్‌పై దాడి చేయడానికి అత్యంత వేగవంతమైన, ప్రమాదకరమైన జెట్ ఫైటర్‌గా పరిగణించే పాక్ F-104 స్టార్‌ఫైటర్ సిద్ధమవుతోంది.

రాత్రి సమయంలో శత్రువు కుట్ర..
వింగ్ కమాండర్ మిడిల్‌కోట్ పాకిస్థానీ F-104 స్టార్‌ఫైటర్‌ను నడుపుతున్నాడు. రాత్రి చీకటిని ఆసరాగా చేసుకుని భారత సరిహద్దులోకి చొరబడటానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. కానీ భారత వైమానిక దళం నిఘా చాలా పదునైనది కాబట్టి శత్రువు కదలిక గుర్తించింది. వార్త అందిన వెంటనే, ‘బ్లాక్ ఆర్చర్స్’ MiG-21లు రంగంలోకి దిగాయి. MiG-21 ఫ్లైట్ లెఫ్టినెంట్ భరత్ భూషణ్ సన్ చేతిలో ఉంది. వెంటనే ఆయనకు శత్రు జెట్‌ను అడ్డగించమని, అంటే దానిని మధ్యలో ఆపమని ఆయనకు ఆదేశించాలు వచ్చాయి.

ఇండియన్ హీరో ఏమాత్రం సమయం వృథా చేయకుండా ఆకాశంలోకి వెళ్లి శత్రువు కోసం వెతకడం ప్రారంభించాడు. చాలా తర్వగా ఆయన రాడార్ పాకిస్థానీ F-104ను గుర్తించింది. ఈ F-104ను కూల్చివేసే శక్తి అంత సులభం కాదు, కానీ సన్ ధైర్యం, నైపుణ్యం సాటిలేనివి. ఆయన తన MiG-21ను F-104 వెనుక ఉంచి సరైన క్షణం కోసం వేచి చూసి, కరెక్ట్ టైం రాగానే K-13 క్షిపణిని ప్రయోగించాడు. ఈ క్షిపణి నేరుగా F-104ను ఢీకొట్టింది. ఆకాశంలో భారీ పేలుడు సంభవించింది. ఆ క్షణంలో పాకిస్థాన్ అహంకారం మంటల్లో చిక్కుకుంది. ఆ ఫ్లైట్ వింగ్ కమాండర్ జెట్ నుంచి దూకిన కూడా ఆయన చనిపోయారు.

పాక్ కలను చెదరగొట్టిన మిగ్-21
ఈ చారిత్రక విజయం F-104 పై MiG-21 సాధించిన తొలి ధృవీకరించన విజయం. ఇది భారత వైమానిక దళానికి గర్వకారణంగా మారింది. ఈ ఒక్క క్షిపణి F-104 పై పాకిస్థాన్ అహంకారాన్ని దెబ్బతీయడమే కాకుండా, ఈ జెట్ విమానాలను భారత్‌కు సరఫరా చేయడానికి నిరాకరించిన అగ్రరాజ్యం అమెరికా గర్వాన్ని తొమ్మిదేళ్ల తర్వాత తుడిచిపెట్టింది. ఈ విజయం నిజంగా పాక్ సైన్యాన్ని భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు, భారత సైనిక బలాన్ని తక్కువ అంచనా వేసే తప్పును అమెరికా ఎలా చేసిందో ఆశ్చర్యపోయేలా చేసింది. జామ్‌నగర్ ఆకాశంలో జరిగిన ఈ అద్భుతమైన విజయానికి, ఫ్లైట్ లెఫ్టినెంట్ భరత్ భూషణ్ సన్‌కు వీర్ చక్ర లభించింది.

READ ALSO: Craigslist Success Story: ‘కోట్లు సంపాదిస్తున్న వెబ్‌సైట్’.. ఏంటీ దీని ప్రత్యేక!

Exit mobile version