Uddav Shivsena: మహావికాస్ అఘాడీ నుంచి బయటకు వచ్చే యోచనలో ఉద్ధవ్-శివసేన.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddav Shivsena: స్వాతంత్య్ర సమరయోధుడు వీడీ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన తీవ్ర విమర్శలతో నొచ్చుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే యూపీఏ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మహావికాస్ అఘాడీకి గుడ్‌బై చెప్పే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ఆదిత్య థాకరే ఇటీవలే భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌తో కలిసి పాదయాత్ర కూడా చేశారు. అయితే శివసేన స్ఫూర్తిదాతగా భావించే వీరసావర్కర్‌పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేయడాన్ని శివసేన తప్పుబడుతోంది.
భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి వీర్ సావర్కర్‌ను తెరపైకి తీసుకొచ్చారు. గురువారం భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని అకోలాలో మీడియాతో మాట్లాడిన రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈసారి మరింత దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. ఆయన బ్రిటీషర్లకు సాయం చేశారని.. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్‌లాంటి నేతలకు నమ్మక ద్రోహం చేశారని రాహుల్ ఆరోపించడం గమనార్హం. గాంధీ, నెహ్రూ, పటేల్‌లకు ద్రోహం చేయడంతో పాటు సావర్కర్ బ్రిటీష్ వారికి సహకరించారని కూడా రాహుల్ ఆరోపణలు చేశారు. సావర్కర్ పిరికివాడని కూడా రాహుల్ ఆరోపించారు. వీర సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సావర్కర్‌ను అవమానించడం తగదని హెచ్చరించారు.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
JP Nadda: కాంగ్రెస్ మాత్రమే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయగలదు.. ఏకం కాదు..
కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడీ ఏర్పాటు చేసుకుని రెండున్నరేళ్లు ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర సీఎంగా కొనసాగారు. అయితే హిందుత్వ సిద్ధాంతాలపై ఉద్ధవ్ రాజీ పడటంతో ఆయన భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో పాటు మెజార్టీ శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే జట్టులో చేరిపోయారు. ఉద్ధవ్ దాదాపు ఒంటరివారైపోయారు. అయితే సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్ధవ్ యూపీఏకు గుడ్‌బై చెబితే తిరిగి ఎన్డీయేలో చేరే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!