NTV Telugu Site icon

Israel- Hamas War: ఇజ్రాయెల్ ప్రజల కిడ్నాప్.. అల్-షిఫా ఆస్పత్రిలో దాచిన వీడియో వైరల్

Israel Hamas

Israel Hamas

గత రెండు నెలలకు పైగా ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. గాజాలో హమాస్‌ను నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో యాక్షన్ కు దిగింది. ఇంతలో, ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫాలో తనలో ముమ్మరంగా దర్యాప్తు చేసింది. దీంతో అందులో అనేక సొరంగ మార్గాలు కనిపించడంతో ఇజ్రాయెలో సైనికులు వేగంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Read Also: Costly Cherries : ఈ చెర్రీలు చాలా ఖరీదైనవి.. ప్రత్యేకత ఏంటంటే?

అయితే, దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదుల ఆకస్మిక దాడి చేసి ఇజ్రాయెల్ ప్రజలను కిడ్నాప్ చేసి అక్టోబర్ 7న గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఓ సీసీ ఫుటేజీని విడుదల చేసింది. ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన వీడియోలో అక్టోబర్ 7వ తారీఖున ఉదయం 10.53 గంటలకు ఈ విజువల్స్ మనం చూడొచ్చు. ఇందులో, ఐదుగురు వ్యక్తులు కొంత మందిని ఆసుపత్రిలోకి బలవంతంగా తీసుకుపోవడం కనిపిస్తుంది. వారిలో ముగ్గురు ఆయుధాలు కలిగి ఉన్నారు. హమాస్ ఉగ్రవాదులు బందీలను ఆసుపత్రిలో దాచిపెట్టారని, వారిపై కూడా దాడి చేశారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. హమాస్ తీవ్రవాద సంస్థ షిఫా ఆసుపత్రిని తీవ్రవాద మౌలిక సదుపాయాలుగా ఉపయోగించుకున్నదని ఇజ్రాయెల్ భద్రత దళాలు ఆరోపిస్తున్నాయి.

Read Also: Sriram: భూమికను చంపేయాలనుకున్నాను.. కత్తి తీసుకొని

మరోవైపు, ఆసుపత్రి లోపల కమాండ్ సెంటర్ లేదని హమాస్ వైద్య సిబ్బంది ఖండించారు. హమాస్ ముష్కరులు దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ప్రారంభించిన ఉదయం ఈ సీసీటీవీ ఫుటేజీ మనకు కనిపిస్తుంది. ఈ దాడుల్లో సుమారు 1,200 మంది మరణించారు. అయితే అప్పటి నుంచి ఇజ్రాయెల్ భద్రత సిబ్బంది హమాస్‌పై వేగంగా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులతో పాటు సోదాలు నిర్వహిస్తోంది. దీని కారణంగా 13,000 మంది పాలస్తీనియన్లు మరణించారు.