MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?

Mi Vs Srh

Mi Vs Srh

MI Vs SRH Playing XI: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ కీలకమే. నేడు ముంబైలో ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనున్న ముంబై జట్టు పరిస్థితి ‘డూ ఆర్ డై’ గా మారింది. ఇప్పటికే 7 మ్యాచ్‌ల్లో 5 ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై, టోర్నీలో కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది.

ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అలాగే బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా సహా పేస్ యూనిట్ ప్రభావం చూపలేకపోవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల భారీ ఓటమి ముంబై పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. అయితే గతంలో కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే వారు తిరిగి పుంజుకుని అద్భుత ప్రదర్శన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. వరుసగా 4 విజయాలతో భీకర ఫామ్ లో ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉండగా.. ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ లు దుమ్ములేపుతున్నారు. ఇక ఇరుజట్ల హెడ్ టు హెడ్ రికార్డు పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 25 సార్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ 15 మ్యాచ్‌లు గెలవగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్‌లు గెలిచింది.

జట్లు ప్లేయింగ్ XI(అంచనా):
ముంబై ఇండియన్స్: క్వింటన్ డీకాక్, రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్, విల్ జాక్స్, శార్దూల్ ఠాకూర్, ఏఎం ఘజన్‌ ఫర్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంపాక్ట్ ప్లేయర్: అశ్వని కుమార్

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హైన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఈషాన్ మాలింగా.
ఇంపాక్ట్ ప్లేయర్: సాకిబ్ హుస్సేన్.