NTV Telugu Site icon

Hardik Pandya: నా తప్పిదం వల్లే ఈ పరాజయం: హార్దిక్ పాండ్యా

Hardik Pandya Mi

Hardik Pandya Mi

Captain Hardik Pandya on Mumbai Indians Defeat vs Rajasthan Royals: కీలక సమయంలో తాను ఔటవ్వడమే ముంబై ఇండియన్స్ ఓటమిని శాసించిందని ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా బాధగా ఉందని పేర్కొన్నాడు. ఈరోజు వాంఖడే వికెట్‌ తాము ఊహించిన దానికంటే భిన్నంగా ఉందని, ఓటమికి దీనిని సాకుగా చెప్పాలనకోవడం లేదన్నాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో గెలవడానికి ప్రయత్నిస్తామని హార్దిక్ చెప్పుకొచ్చాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది హ్యాట్రిక్ పరాజయం.

మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ… ‘మ్యాచ్‌లో ఓడిపోవడం బాధగా ఉంది. మాకు మంచి ఆరంభం లభించలేదు. నేను ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడి చేయాలనుకున్నాను. 150-160 పరుగులు చేస్తే బాగుండేది. కానీ నేను ఔటయ్యాక రాజస్తాన్‌ రాయల్స్ తిరిగి గేమ్‌లోకి వచ్చింది. నేను మరికొన్ని ఓవర్లు క్రీజులో ఉండాల్సింది’ అని అన్నాడు.

Also Read: Iran Embassy: సిరియాలోని ఇరాన్‌ ఎంబసీపై ఇజ్రాయెల్‌ దాడి.. 11 మంది మృతి

‘ఈరోజు వాంఖడే వికెట్‌ మేము ఊహించిన దానికంటే భిన్నంగా ఉంది.ఓటమికి దీనిని సాకుగా చెప్పాలేను. ఎందుకంటే బ్యాటర్‌గా ఏ వికెట్‌పైన అయినా ఆడటానికి సిద్దంగా ఉండాలి. రాజస్థాన్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. మేము అనుకున్న విధంగా ఫలితాలు రావడం లేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. కానీ ఒక టీమ్‌గా మాపై మాకు నమ్మకం ఉంది. మేం విజయాల బాట పడుతాం అని నమ్ముతున్నాము. కొంచెం క్రమశిక్షణతో ఉండాలి. ఎక్కువ ధైర్యం చూపించాలి. తర్వాతి మ్యాచ్‌ల్లో కమ్‌బ్యాక్‌ ఇస్తాం’ అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.