NTV Telugu Site icon

MI vs RCB: నేడు ఐపీఎల్‌ లో బిగ్‌ ఫైట్‌.. కాకపోతే..?

2

2

నేడు ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా బిగ్ ఫైట్ జరగనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా గెలిచిన ముంబై ఇండియన్స్ వారి సొంత మైదానమైన వాంఖడేలో స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతుంది. ఇరు జట్లలో దిగ్గజ ఆటగాళ్లు ఉండడం పై ఈ మ్యాచ్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్లకు మంచి బజ్ నెలకొని ఉండేది. ఇకపోతే నేడు రాత్రి 7:30 గంటల సమయంలో మ్యాచ్ ముంబై వేదికన మొదలు కాబోతోంది.

ఇకపోతే ఆటగాళ్లు గొప్పగా కనిపిస్తున్నప్పటికీ.. ఈ సీజన్ లో మాత్రం ఇరు జట్ల ప్రదర్శన మాత్రం చాలా పేలవంగా ఉంది. దీనికి కారణం ముంబై పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండగా.. బెంగళూరు 9వ స్థానంలో ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంది దీనికి కారణం జట్టు ఐదు మ్యాచ్లు ఆడితే., కేవలం అందులో ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. మరోవైపు ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఈ సీజన్ లో ఆడిన గత నాలుగు మ్యాచ్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.

ఇకపోతే ఐపిఎల్ మొదలైనప్పటి నుంచి ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ లలో పోటీపడగా అందులో ముంబై ఇండియన్స్ 18 సార్లు విజయం సాధించిగా.. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 14 సార్లు విజయం సాధించింది. మొత్తానికి చూసుకుంటే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై ముంబై పై చేయి కనబడుతోంది. ఇక ప్రస్తుత సీజన్ గమనించినట్లయితే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కంటే ముంబై కాస్త మెరుగ్గా కనబడుతోంది. ఇది ఇలా ఉంటే.. ఆర్సీబీలో కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే విజయం వైపు నడిపించాలని ప్రయత్నం చేస్తున్న.. జట్టులో ఉన్న విదేశీ స్టార్ట్ ఆటగాళ్లు ఉన్న వారు ఒక మ్యాచ్లో కూడా వారి స్థాయికి తగ్గట్టు మ్యాచ్ ప్రదర్శన ఇవ్వకపోవడమే. ఇక ముంబై టీంలో అయితే అందరూ ఉన్న.. తగిన ప్రదర్శన ఇస్తున్న కానీ.. ఎక్కడో లోపం కారణంగా ముంబై మ్యాచ్లను ఓడిపోతోంది. ఇక నేటి మ్యాచ్లో ఆటగాళ్ల విషయానికి వస్తే ఇలా అంచనా వేస్తే..

ముంబై ఇండియన్స్‌ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, లూక్‌ వుడ్‌, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. అలాగే..

ఆర్సీబీలో డుప్లెసిస్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్‌కీపర్‌), విల్‌ జాక్స్‌, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ లు ఉన్నారు.