Site icon NTV Telugu

MI vs RCB: రజత్ పాటిదార్, విరాట్ మెరుపులు.. ముంబై లక్ష్యం ఎంతంటే?

Kohli

Kohli

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు నిర్ణీత 20 ఓర్లలో 05 వికెట్లు కోల్పోయి 221 పరుగులు సాధించి ముంబైకి 222 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ ఆరంభంలోనే ఆర్సీబీకి ముంబై బౌలర్ ట్రెంట్ బౌల్ట్ షాకిచ్చాడు. తొలి ఓవ‌ర్లోనే ఫిలిప్ సాల్ట్(4) బౌల్డ్ అయ్యాడు.

Also Read:Adhi Dha Surprisu : అదిదా ‘సర్ప్రైజ్’ వీడియో సాంగ్ వచ్చింది.. కానీ సర్ప్రైజ్ మిస్సయింది?

ఆ తర్వాత విరాట్ కోహ్లీ బౌండరీలతో విరుచుకుపడుతూ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 67 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దేవదత్ పడిక్కల్ కూడా ఫామ్‌లో కనిపించాడు. పాడిక్కల్ 37 పరుగులు చేసిన తర్వాత 9వ ఓవర్‌లో ఔటయ్యాడు. రజత్ పాటిదార్ విజృంభించాడు. ముంబై బౌలర్లకు చెమటలు పట్టించాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 64 పరుగులు సాధించాడు.

Exit mobile version