NTV Telugu Site icon

Hardik Pandya: ఫైనల్లీ హార్దిక్ పాండ్యా దొరికేశాడు.. ఏకంగా బస్సులో! వీడియో వైరల్

Jasmin Walia

Jasmin Walia

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2019 డిసెంబర్‌ 31న దుబాయ్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల సమక్షంలో ఇద్దరు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. 2020 జులైలో నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. 2023 ఫిబ్రవరి 14న హార్దిక్‌, నటాషాలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్యాలెస్‌లో రెండోసారి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని నెలలకే వీరి మధ్య విభేదాలు రావడంతో 2024 జులై 19న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆగస్టులో అధికారికంగా హార్దిక్, నటాషాకు విడాకులు మంజూరు అయ్యాయి.

నటాషా స్టాంకోవిచ్‌ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియాతో హార్దిక్ పాండ్యా డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. గ్రీస్ వెకేషన్ సందర్భంగా ఫొటోస్ చక్కర్లు కొట్టడంతో.. ఇద్దరి మధ్య సంథింగ్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. హార్దిక్ ఆడే పలు మ్యాచ్‌లకు జాస్మిన్ హాజరుకావడంతో ఆ పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో కూడా భారత్ ఆడిన మ్యాచ్‌లలో జాస్మిన్ సందడి చేశారు. అయితే అటు జాస్మిన్ కానీ, ఇటు హార్దిక్ కానీ తమ సంబంధాన్ని ధృవీకరించలేదు. ఫైనల్లీ ఇద్దరు దొరికేశారు.

Also Read: Rohit Sharma: రోహిత్‌ కాబట్టే ఇంకా టీంలో ఉన్నాడు.. హిట్‌మ్యాన్‌పై మాజీ కెప్టెన్‌ విమర్శలు!

ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా రూమర్ గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్ వాలియా సందడి చేశారు. వాంఖడే స్టేడియంలో కేకలు వేస్తూ.. ముంబై జట్టును ఉత్సాహపరిచారు. అంతేకాదు మ్యాచ్ అనంతరం జాస్మిన్ కూడా ముంబై ఇండియన్స్ బస్సు ఎక్కేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజెన్స్.. ఫైనల్లీ హార్దిక్ పాండ్యా దొరికేశాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ‘హార్దిక్, జాస్మిన్ డేటింగ్ కన్ఫర్మ్‌’, ‘ఇంకేం ప్రూఫ్ కావాలి’ అంటూ ట్వీటుతున్నారు.