NTV Telugu Site icon

MI vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్..

Mi Vs Kkr

Mi Vs Kkr

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ముంబై ఇండియన్స్- కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ముంబై జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. నమన్ ధీర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు.. రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు. అటు.. కోల్కతా మార్పులేమీ చేయకుండానే బరిలోకి దిగుతుంది.

కోల్కతా ప్లేయింగ్ ఎలెవన్:
ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

ముంబై ప్లేయింగ్ ఎలెవన్:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.