హైదరాబాద్ మహానగరం మెట్రో ప్రయాణికులకు మెట్రో సంస్థ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు రాత్రి వేళలో అలాగే తెల్లవారుజామున ప్రయాణాలకు సంబంధించి ఉన్న రాయితీని ఎత్తేసింది. దీనికి కారణం ప్రస్తుతం వేసవి కాలంలో బయట ప్రయాణించే కంటే ప్రజలు మెట్రో రైలులో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. దీంతో మెట్రో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదాయం పెంచుకునే దిశగా హైదరాబాద్ మెట్రో సంస్థ ఈ పని చేసినాట్లు అర్థమవుతుంది.
Also read: SRH vs PBKS: హాఫ్ సెంచరీతో రాణించిన నితీష్ రెడ్డి.. పంజాబ్ టార్గెట్ 183..!
ప్రస్తుతం ఎండాకాలం నేపథ్యంలో భాగంగా బయట ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. బస్సుల్లో, బైకుల్లో అలాగే ఇతర రోడ్డు ట్రాన్స్పోర్ట్ లలో ప్రయాణించే పరిస్థితి కనపడట్లేదు. దీంతో చాలామంది మెట్రో ట్రైన్ లో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. కాకపోతే మెట్రో ప్రయాణికులకు ఇప్పుడు షాక్ ఇస్తూ టికెట్ పై ఉన్న రాయితీని ఎత్తేసింది హైదరాబాద్ మెట్రో సంస్థ. దీంతో మెట్రో ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి ఉదయం పూట ఇచ్చే 10% రాయితీని కూడా ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రయాణికులు కాస్త అధికారులపై ఆగ్రహంతో ఉన్నారు.
Also read:Heeramandi: ఏంటి భయ్యా.. ఇంతమంది స్టార్ హీరోయిన్స్ ఒకే సినిమాలో వేశ్యలుగా నటించారా..?!
మెట్రో రైల్లో రెగ్యులర్ గా ప్రయాణించే వారి కోసం ఇదివరకు అధికారులు రూ. 59 హాలిడే కార్డును తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్డును ఉపయోగించి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు, అలాగే రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు చేసే మెట్రో ప్రయాణాలలో టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఎండలు పెరగడంతో బస్సు సొంత వాహనాల్లో వెళ్లేందుకు చాలా మంది సంశయిస్తున్నారు. దీంతో నగరవాసులు మెట్రో ప్రయాణానికి ముగ్గు చూపుతున్న నేపథ్యంలో వారి రద్దీని క్యాష్ గా చేసుకోవడానికి మెట్రో అధికారులు ఈ హాలిడే కార్డు రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంగతి పై మెట్రో ప్రయాణికులు రాయితీని మరల పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.