NTV Telugu Site icon

KBR Park: మెట్రో మార్నింగ్‌ ఆఫర్‌.. కేబీఆర్‌ పార్క్ లో వాకింగ్‌కు వెళ్లే వారికి రాయితీ..!

Hyderabad Metro

Hyderabad Metro

KBR Park: హైదరాబాద్ వాసులకు మెట్రో రైలు అధికారులు శుభవార్త అందించారు. కేబీఆర్ పార్కులో వాకింగ్ కు వెళ్లే వారి కోసం ఎల్ అండ్ టీ మెట్రో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య, రాత్రి 8 నుంచి 11.59 గంటల మధ్య మెట్రోలో ప్రయాణించే వారికి స్మార్ట్ కార్డ్‌పై 10 శాతం తగ్గింపును ప్రకటించింది. నగరంలో ఎక్కడి నుంచైనా మెట్రోలో ప్రయాణించి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద దిగే వారికి సూపర్ ఆవర్స్‌లో ఈ రాయితీ ఇస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. కేబీఆర్‌లోని పార్కులో ఉదయం, రాత్రి వేళల్లో వాకింగ్ చేసే వారికి ఈ ఆఫర్ ప్రత్యేకంగా వర్తిస్తుంది. చాలా మంది వాకింగ్ కు కేబీఆర్ వస్తుంటారని దీంతో ఈ ఆఫర్ ఉపయోగించుకోవాలని సూచించారు మెట్రో అధికారులు. అంతే కాకుండా.. ట్రాఫిక్ నియంత్రణ తగ్గించేందుకు ఆఫర్ ప్రకటించామని తెలిపింది. వాకర్స్ చాలా మంది కార్లు వేసుకుని వస్తుంటారని దాని వల్ల ఎక్కడ పార్కింగ్ చేయాలో సతమతమౌతుంటారని తెలిపారు. కాబట్టి కార్లు ఉపయోగించుకోకుండా వాకర్స్ అందరూ మెట్రోను ఉపయోగించుకోవాలని సూచించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఉండదని తెలిపారు. ఇక కేబీఆర్ పార్క్ కు వాకింక్ కోసం వెళ్లేవారు ఈ ప్రత్యేక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

Read also: Jyothi Rai : జ్యోతి రాయ్ వయసు ఎంతో తెలుసా?.. ఇంత చిన్నదా?

కాగా.. సాధారణంగా మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. కానీ.. నూతన సంవత్సర వేడుకలు హైదరాబాద్ వాసులకు మెట్రో రైలు అధికారులు శుభవార్త అందించిన విషయం తెలిసిందే.. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు రైళ్లను నడపాలని మెట్రో రైలు నిర్ణయించింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో సేవలు నడుస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ వెల్లడించారు. చివరి రైలు ఆయా స్టేషన్ల నుంచి 12.15 నిమిషాలకు బయలుదేరుతుందని తెలిపారు. రెడ్, బ్లూ, గ్రీన్ లైన్లలో మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయని మెట్రో రైల్ ఎండీ తెలిపారు. అయితే ఈ సమయంలో మెట్రో రైలు సమయం పెంచినందున భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రయాణికులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి, అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే..
Budget 2024 LIVE: పార్లమెంట్‌ ముందు నిర్మలమ్మ బడ్జెట్‌ పద్దు.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్