NTV Telugu Site icon

Hyderabad Metro : హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. న్యూయర్‌ వేడుకల కోసం అర్థరాత్రి వరకు మెట్రోసర్వీసులు

Hyderabad Metro

Hyderabad Metro

న్యూయర్‌ వేడుకలకు హైదరాబాద్‌ నగరం సిద్ధమైవుతోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ వాసులకు మెట్రో రైలు అర్థరాత్రి వరకు అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సురక్షితమైన ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు హైదరాబాద్ మెట్రో జనవరి 1 తెల్లవారుజాము వరకు నడుస్తుంది. హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్‌విఎస్ రెడ్డి మాట్లాడుతూ.. చివరి రైళ్లు ప్రారంభమైన స్టేషన్‌ల నుండి తెల్లవారుజామున 1 గంటలకు బయలుదేరి జనవరి 1న తెల్లవారుజామున 2 గంటలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని ప్రకటించారు. రైళ్లు, స్టేషన్లలో మద్యం తాగి దుర్భాషలాడకుండా మెట్రో రైల్ పోలీసులు, సెక్యూరిటీ వింగ్‌లు నిఘా ఉంచుతాయని ఆయన పేర్కొన్నారు.
Also Read : Bhuma Akhila Priya: ఇక్కడ బతకడం కంటే.. పక్క రాష్ట్రాల్లో చిన్న వ్యాపారం చేసుకుని బతకొచ్చు అనే పరిస్థితి వచ్చింది..!

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా మెట్రో రైళ్లలో అధికారులు సహకరించాలని, బాధ్యతాయుతంగా ప్రయాణించాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ డైరెక్టర్ కెవిబి రెడ్డి ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలకు ముందు, ట్రాఫిక్ పోలీసులు ఫ్లైఓవర్లు, PVNR ఎక్స్‌ప్రెస్‌వే మరియు ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ మార్గదర్శకాలను జారీ చేశారు. మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్‌లోని శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ 1 మరియు 2, షేక్‌పేట్, మైండ్‌స్పేస్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, సైబర్ టవర్స్, ఫోరమ్ మాల్-జెఎన్‌టియు, కైతలాపూర్ మరియు బాలానగర్, ఫ్లైఓవర్‌లు రాత్రి 11 గంటల ఉదయం 5గంటల వరకు మూసివేయబడతాయి.

Show comments