Site icon NTV Telugu

Metro Rail Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెట్రోలో భారీగా ఉద్యోగాలు..

metro jobs

metro jobs

నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. మెట్రోలో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. తాజాగా మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా అనేక పోస్టులు భర్తీ చేయనుంది. అభ్యర్థులు అధికారిక సైట్ mpmetrorail.comని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 ఆగస్టు 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 88 పోస్టులను భర్తీ చేస్తారు. దీనిలో భాగంగా.. 26 సూపర్‌వైజర్‌ (ఆపరేషన్‌), 12 మెయింటెయినర్‌, 9 సూపర్‌వైజర్‌, 9 మెయింటెయినర్‌ (ట్రాక్షన్‌), 8 సూపర్‌వైజర్‌ (ట్రాక్షన్‌), సూపర్‌వైజర్‌ (ట్రాక్‌), స్టోర్‌, అసిస్టెంట్‌ హెచ్‌ఆర్‌ అండ్‌ అకౌంట్స్‌ 2 -2 పోస్టులను భర్తీ చేయనున్నారు..ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి తప్పనిసరిగా 10వ, 12వ తరగతి ఉత్తీర్ణత, ITI, ఇంజనీరింగ్ మరియు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి..

ఇకపోతే అభ్యర్థుల వయస్సు కూడా పరిగణలోకి తీసుకుంటారు.. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకున్న రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 20 వేల నుంచి లక్ష రూపాయల వరకు వేతనం లభిస్తుంది..జనరల్ / OBC కేటగిరీ అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ కోసం రూ. 590 ఫీజు చెల్లించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు ఫీజుగా రూ. 295 చెల్లించాల్సి ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఈ నెల 31 చివరి తేదీ.. ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికారిక సైట్ https://mpmetrorail.com/ సహాయం తీసుకోవచ్చు..

Exit mobile version