NTV Telugu Site icon

WhatsApp: గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్ యూజర్లకు గ్రీన్ టిక్..

Whatsapp

Whatsapp

భారతదేశంలోని వాట్సప్ బిజినెస్ వినియోగదారుల కోసం మెటా సంస్థ వెరిఫైడ్ ప్రోగ్రాంను తీసుకువచ్చింది. ఇలాంటి ప్రక్రియ ఇదివరకే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో ఉండగా 2023 సెప్టెంబర్ లోనే వాట్సాప్ బిజినెస్ యాప్ వాడేవారి కోసం ఈ ప్రోగ్రాంను తీసుకువచ్చింది. ఇకపోతే ఈ ఆప్షన్ ను కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ఇండోనేషియా, కొలంబియా, బ్రెజిల్ దేశాల్లో కూడా వెరిఫైడ్ ప్రోగ్రామును మొదలు పెట్టబోతోంది. ఇకపోతే వాట్సప్ అకౌంట్ కు పక్కన గ్రీన్ టిక్ రావాలంటే అకౌంట్ ను వెరిఫికేషన్ కు అప్లై చేసుకోవాలి.

Norway Chess: నాకమురాను ఓడించిన ప్రజ్ఞనంద.. విజేతగా నిలిచిన కార్ల్‌సెన్..

ఆ తర్వాత మీ ఖాతాను వాట్సప్ సంస్థ వెరిఫై చేసి వెరిఫికేషన్ బ్యాడ్జిను అందిస్తుంది. ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ మాదిరిగానే వాట్సప్ బిజినెస్ ఖాతాకు మెటా వెరిఫైడ్ సుబ్స్క్రిప్షన్ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న వారికి మాత్రమే గ్రీన్ టీక్ ఇస్తుంది వాట్సాప్. ఈ వెరిఫైడ్ అకౌంట్ సబ్స్క్రిప్షన్ ద్వారా వారి ఖాతాలకు గ్రీన్ టీక్ కనబడుతుంది. ఇది ఉండడం ద్వారా మీరు ఒరిజినాలిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మరొకరు మీ వ్యాపారం పేరుతో మరొక నకిలీ ఖాతా తెరవకుండా రక్షణ కల్పిస్తుంది. అలాగే మరికొన్ని మార్కెటింగ్ అవకాశాల కోసం వాట్సాప్ ఛానల్ ను కూడా మెటా క్రియేట్ చేసి అందిస్తుంది. ఈ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న యూసర్లు వివిధ డివైస్ ల ద్వారా లాగిన్ అవ్వడానికి అవకాశం కల్పిస్తుంది.

Abhishek Sharma: సునామి సృష్టించిన అభిషేక్ శర్మ.. 25 బంతుల్లో మెరుపు సెంచరీ..

మీ కస్టమర్లకు, వెండర్లకు కనిపించే విధంగా మీ బిజినెస్ వివరాలతో కూడిన కస్టమ్ వెబ్ పేజీని కూడా క్రియేట్ చేయడానికి ఇది దోహదపడుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇవ్వకుండానే కస్టమర్ సపోర్ట్ కూడా నేరుగా కాల్ చేసుకుని ఫెసిలిటీని అందిస్తుంది. కాకపోతే., ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ఇందుకు సంబంధించి భవిష్యత్తులో మెటా కంపెనీ రుసుము వసూలు చేసే అవకాశం ఉంది. అయితే పక్కాగా ఎంత కలెక్ట్ చేస్తుందన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.