Site icon NTV Telugu

Menthikura Chicken : మెంతికూర చికెన్ ను ఇలా తయారు చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..

Menthi Kura Chicken

Menthi Kura Chicken

చికెన్ తో ఎన్నో రకాల వంటలను తయారు చేస్తారు.. ఎప్పుడూ కొత్తగా ట్రై చెయ్యాలని అనుకొనేవారు మెంతికూర చికెన్ ను చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది..తరచూ చేసే చికెన్ కర్రీల కంటే ఈ విధంగా మెంతికూర వేసి చేసిన చికెన్ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎంతో రుచిగా ఉండే మెంతికూర చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావల్సిన పదారర్థాలు..

చికెన్ – అరకిలో,

మెంతికూర – గుప్పెడు,

నూనె -3 టేబుల్ స్పూన్స్,

పొడవుగా తరిగిన ఉల్లిపాయలు – 2,

పుచ్చగింజలు లేదా జీడిపప్పు -ఒక టేబుల్ స్పూన్,

తరిగిన టమాటాలు – 2,

ఉప్పు – తగినంత,

లవంగాలు – 3,

యాలకులు – 2,

దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క,

జీలకర్ర -అర టీ స్పూన్,

పసుపు – అర టీ స్పూన్,

తరిగిన పచ్చిమిర్చి – 3,

కరివేపాకు – రెండు రెమ్మలు,

అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టేబుల్ స్పూన్,

కారం – 2 టీ స్పూన్స్,

ధనియాల పొడి -ఒకటిన్నర టీ స్పూన్,

నీళ్లు – ఒకటిన్నర గ్లాస్,

గరం మసాలా – ఒక టీ స్పూన్,

తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

తయారీ విధానం :

ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి..నూనె వెడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత మెంతికూర వేసి కలపాలి. ఈ మెంతికూరను పూర్తిగా వేయించిన తరువాత పచ్చగింజలు వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత దీనిని జార్ లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.. ఆ తర్వాత పోపు దినుసులు వేసి వేగాక చికెన్ ను వెయ్యాలి..పసుపు ఉప్పు వేసి బాగా కలపాలి.. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు, గరం మసాలా వేసి కలపాలి. తరువాత మూత పెట్టి చిన్న మంటపై చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.. స్టవ్ ఆఫ్ చేసి చివరగా కొత్తి మీర వేసుకొని చల్లి సర్వ్ చేసుకోవాలి.. అంతే ఎంతో రుచికరమైన మెంతికూర చికెన్ రెడీ.. మీరు కూడా ట్రై చెయ్యండి..

Exit mobile version