Cruel Father: రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు వచ్చిన భార్య, కోడలిని గాయపరిచాడు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. నిందితుడు పర్బత్‌సర్‌కు చెందిన మనారామ్ (57)ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వారు తెలిపారు.మనారామ్ తన కుమార్తెలు మీరా (26), రేఖ (20)లను సోమవారం గొడ్డలితో నరికి చంపాడు. మీరా, రేఖలను కాపాడేందుకు ప్రయత్నించిన భార్య, కోడలుపై కూడా దాడి చేశాడని నాగౌర్ పోలీసు సూపరింటెండెంట్ రామమూర్తి జోషి తెలిపారు.
Read Also: Bangladesh fire: బట్టల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది దుకాణాలు దగ్ధం
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అతని కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనారామ్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.ప్రాథమిక విచారణలో మనారామ్ మానసిక స్థితి సరిగా లేదని తేలిందని మక్రానా సర్కిల్ ఆఫీసర్ రవిరాజ్ సింగ్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను మీరా, రేఖ కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.