NTV Telugu Site icon

Holi 2025: ఏపీలో వింత ఆచారం.. హోలీ వేళ.. స్త్రీ వేషధారణలో పురుషులు..

Ap Mews

Ap Mews

మనం అన్ని పండుగలనూ ఆనందంగానే జరుపుకుంటాం. హోలీని మరింత సంబరంగా జరుపుకుంటాం. ఎందుకంటే అది వసంతాగమనానికి పీఠిక కాబట్టి. అది ప్రకృతి కొత్త అందాలు నింపుకున్నదనటానికి సూచిక కాబట్టి. ఆమని వచ్చే వేళ రంగురంగులతో ముస్తాబవుతున్న అవనిని చూసి మది మురిసిపోతుంది. ఆ మురిపెంలోనే రంగులు చల్లుకొనాలనిపిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ హాయిగా జరుపుకునే ఈ ఆనందకేళీ హోలీకి అనంతానంత నేపథ్యం ఉంది. ఉత్తరభారతంలో జోరుగా సాగే ఈ పండుగ దక్షిణ భారతంలోనూ హుషారు తెప్పిస్తోంది. ఇప్పుడు విదేశాల్లోనూ అందంగా పలకరిస్తూ ప్రపంచాన్ని వర్ణమయం చేస్తోంది.

READ MORE: Gaza: ఆఫ్రికాకు పాలస్తీనా ప్రజలు.. యూఎస్, ఇజ్రాయిల్ ప్లాన్..

సమస్త భారతావని సప్తవర్ణ శోభితమయ్యే ఆనందోత్సవాన్ని ఏపీలోని కర్నూలు ప్రాంతంలో విభిన్నంగా జరుపుకుంటున్నారు. ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో వింత ఆచారం కనిపించింది. ఈ గ్రామంలో రెండ్రోజుల పాటు పురుషులు స్త్రీ వేషధారణలో కనిపిస్తారు. వేషధారణ అంటే ఏదో అలా చీర కట్టుకుని సాధారణంగా రెడీ అవుతారనుకుంటే పొరపాటే. పండగ పూట స్త్రీలు ఎలాగైన ఖరీదైన చీరలు కట్టుకుని, ఒంటి నిండా నగలతో అలంకరించుకున్నట్లే తయారవుతారు. అదే వేషధారణలో పురుషులు రతి మన్మథుడి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆచారం దశాబ్ద కాలంగా కొనసాగుతోందట. మగవారు ఆడవారి వేషధారణలో మొక్కులు తీర్చుకోవడంతో గ్రామంలో కరువు, కాటకాలు ఉండవని గ్రామస్థుల నమ్మకం. ఈ ఆచారం గురించి ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల మెజారిటీ ప్రజలు తెలియదు.

READ MORE: Tamil Nadu assembly: రూపాయి సింబల్ మార్పు, మద్యం కుంభకోణం.. సభ నుంచి బీజేపీ, అన్నాడీఎంకే వాకౌట్..