NTV Telugu Site icon

Robbery: మగవాళ్ళంతా దొంగతనాలు.. దొంగలించిన వాటిని ఆడవాళ్లు విక్రయం.. ఎక్కడంటే.?

Roberry

Roberry

Robbery: దోపిడీలు, దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు. ఆ ఊరిలో ఉన్న మగవాళ్ళంతా దొంగతనాలు చేసుకొని వస్తే ఆడవాళ్లు ఆ సొమ్మును విక్రయిస్తుంటారు. వీళ్లంతా కరుడుగట్టిన దొంగలు, దొంగతనాలలో ఎప్పటికప్పుడు ఆరి తేరుతుంటారు. అలాంటి ఆ ఊర్లకు వెళ్ళాలంటేనే పోలీసులకు సాధ్యం కాదు. ఇదేదో సినిమా స్టోరీలా అనిపిస్తుంది కదూ, కానీ ఇది నిజం. మధ్యప్రదేశ్లోని ధార్‌ జిల్లాలో ఉన్న పలు గ్రామాలు అవి. రాచకొండ పోలీసులు ఈ ధార్ గ్యాంగ్‌లో ఓ సభ్యుని అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఏ డి జెల్లెర్స్ పలు రకాల డిజైన్లతో ఆభరణాలను తయారు చేసి వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న జ్యువెలరీ షాపులకు విక్రయిస్తుంటారు. ఈ జ్యువెలర్స్‌కి సంబంధించిన ఒక ఉద్యోగి ఆ బంగారు ఆభరణాలను తీసుకొని వచ్చి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఉన్న పలు జ్యువెలరీ షాపులకు సరఫరా చేస్తాడు. ఇది గత కొన్ని నెలలుగా జరుగుతుంది. ఈ క్రమంలో గత నెల 27వ తేదీన ఈ ఏడి జ్యువెలరీకి సంబంధించిన ఉద్యోగి, సుమారు 2 కిలోలకు పైగా బరువు ఉన్న బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగుతో విజయవాడకు బయలుదేరాడు.

Visakha Railway Zone: విశాఖ రైల్వే జోన్కు సరికొత్తగా భూమి కేటాయింపులు..

ముంబైలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఎక్కిన అతను, చౌటుప్పల్ మండలంలోని ధర్మోజి గూడెం దగ్గర ఉన్న హోటల్ దగ్గర టిఫన్ కోసం బస్సు ఆగడంతో దిగాడు. బంగారు ఆభరణాలతో ఉన్న బ్యాగ్‌ను సీటు కింద ఉంచి దిగాడు. టీ తాగడానికి కిందికి వచ్చి 20 నిమిషాల తర్వాత మళ్లీ బస్సులోకి వెళ్ళాడు. బస్సులో తను పెట్టిన బ్యాగు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగు చోరీకి గురైందని ఫిర్యాదు రావడంతో నాలుగు టీమ్లను ఏర్పాటు చేశారు. ఈ బంగారు ఆభరణాలకు సంబంధించి పక్కా సమాచారం ఉన్నవాళ్లే ఈ చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. అలాంటి వాళ్ళ కోసం గాలింపు చేయడం మొదలుపెట్టారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇలాంటి చోరీలకు పాల్పడే ముఠాల కోసం గాలించారు. చివరకు మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన ముఠా ఈ దోపిడీ చేసిందని గుర్తించారు. ధార్ జిల్లాకి చెందిన సోనీ ఠాకూర్‌‌ ని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ దోపిడీ విషయం వెలుగులోకి వచ్చింది.

Wayanad landslides: వయనాడ్ బాధితుల కష్టాలు విని చలించిన ప్రధాని మోడీ

జ్యువెలరీ వ్యాపారస్తులకు సంబంధించిన బ్యాగ్‌ లను దొంగతనం చేయడానికి ముందు ఓ వెహికల్ ను చోరీ చేస్తారు. ఆ చోరీ చేసిన వాహనంలోని ఈ ఆరెంజ్ ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న వ్యాపారస్తులని టార్గెట్ గా పెట్టుకొని ఛాన్స్ దొరికినప్పుడు చోరీ చేయడం ఈ ముఠా ప్రధాన లక్ష్యం. అలా దొంగతనం చేసిన తర్వాత చోరీ చేసిన కారు నెంబర్ ప్లేట్లను మార్చివేసి తమ స్వగ్రామాలకు వెళ్లిపోతుంటారు. అలా ఈ దొంగతనంలోనూ ఒక క్రెటా కారుని చోరీ చేసి, ఆ కారులోనే ఈ ఆరెంజ్ ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న ఏడి జ్యువలరీ కి సంబంధించిన ఉద్యోగిని వెంబడించారు.

Dragon Fruits: అయ్యబాబోయ్.. డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల ఇన్ని లాభాలా.?

మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాకు చెందిన ఐదు గ్రామాలు మాత్రం ఈ దోపిడీలు, దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. ఈ గ్రామాలలోకి వెళ్లాలంటేనే ఆ రాష్ట్రంలోని పోలీసులు వెనకంజ వేస్తారు. అంత భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి. దీంతో ధార్ జిల్లాలోని ఆ గ్రామాలకు చెందిన పురుషులు బయటకి వచ్చి దోపిడీలు చేయడం, ఆ తర్వాత దోపిడీ సొమ్మును తమ ఊర్లకు తీసుకొని వెళ్లి అమ్మడం చేస్తుంటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో పలు ఊర్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఊర్లలో దోపిడీలు, దొంగతనాలు మానేసి చదువుకుంటూ కొత్త జీవనాన్ని సాగిస్తున్నారు. కానీ ఈ ధార్‌ జిల్లాలోని ఐదు గ్రామాలు మాత్రం ఇంకా ఈ దోపిడీలు, దొంగతనాలు చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం జరిగిన చోరీలో 1832 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు సోనిఠాకూర్‌ని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.