NTV Telugu Site icon

Memantha Siddham Bus Yatra: 21వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఇవాళ్టి షెడ్యూల్‌

Jagan

Jagan

Memantha Siddham Bus Yatra: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరింది.. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీలో రాత్రి బస చేసిన కేంద్రం నుంచి బయల్దేరనున్న సీఎం జగన్‌.. మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుంటారు.. ఇక, స్థానిక చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.. ఈ ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రాముఖ్యత.. ప్రచారవ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్నారు.. అనంతరం.. తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుని.. బొద్దవలస మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం వైఎస్‌ జగన్‌.. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also: Traffic Diversion: నేడు వైన్‌ షాపులు బంద్‌.. ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే?

మొత్తంగా ఈ రోజు విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగనుంది.. జొన్నాడలో మధ్యాహ్న విరామం.. సాయంత్రం విజయనగరం నియోజకవర్గం చెల్లూరు సమీపంలో మేమంతా సిద్ధం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.. అనంతరం భోగాపురం, పూసపాటి రేగ మీదుగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం చేరుకుంటారు సీఎం వైఎస్‌ జగన్‌. కాగా, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. ఇచ్చాపురంలో తన యాత్ర ముగించనున్న విషయం విదితమే.

Show comments