NTV Telugu Site icon

Memantha Siddham Bus Yatra: 8వ రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర..

Jagan

Jagan

Memantha Siddham Bus Yatra: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజుకు చేరింది.. తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న మేమంతా సిద్ధం యాత్ర.. ఈ రోజు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది.. ఈ రోజు ఉదయం 9 గంటలకు గురవరాజుపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది.. మల్లవరం, ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ చిన్న సింగమలమీదగా పోయ్య గ్రామం చేరుకోనుంది యాత్ర..

ఇక, ఉదయం 11 గంటలకు డ్రైవర్స్ అసోసియేషన్స్ తో ముఖముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్‌. అనంతరం చావలిలో భోజన విరామం తీసుకోనున్నారు.. సాయంత్రం 3:30 గంటలకు కాళహస్తి నాయుడుపేట బైపాస్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం దగ్గర ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకోనుంది బస్సు యాత్ర..

అయితే, నేటి నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎంట్రీ కానుంది.. ఈ రోజు సాయంత్రం నాయుడుపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం జగన్‌.. సభ అనంతరం ఓజిలి.. బూదనం.. గూడూరు క్రాస్.. వెంకటాచలం.. కాకుటూరు క్రాస్.. బుజ బుజ నెల్లూరు మీదుగా చింతారెడ్డి పాలెంకు చేరుకోనుంది.. రాత్రికి చింతారెడ్డి పాలెంలో బస చేయనున్నారు సీఎం జగన్‌.. అయితే, రేపు అనగా ఈ నెల 5వ తేదీన మేమంతా సిద్ధం యాత్రకు విరామం ఇవ్వనున్నారు.. 6వ తేదీన సాయంత్రం కావలిలో బహిరంగ సభ నిర్వహిస్తారు.. అనంతరం కందుకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర.