Site icon NTV Telugu

CM KCR: సీఎం కేసీఆర్‌తో మేఘాల‌య ముఖ్యమంత్రి సంగ్మా సమావేశం

Kcr

Kcr

ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి భనవ్ చేరుకున్న సీఎం సంగ్మాను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించాడు. అనంతరం ఆయనకు కేసీఆర్ తేనీటి విందు ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇష్టాగోష్ఠి నిర్వహించారు.

Read Also: Coconut Cultivation : కొబ్బరిలో సాగుతో అదనపు ఆదాయం.. ఈ పంటలతో లక్షల్లో లాభాలు..

మేఘాలయ సీఎం సంగ్మాను కేసీఆర్ శాలువాతో సత్కరించి, మెమొంటో బహుకరించారు. అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మాకు సీఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు. అయితే, ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కె వంశీధర్ రావుతో పాటు ఇతరులు పాల్గొన్నారు.

Read Also: Jabardasth Sailekha: సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారిన సాయి.. ?

Exit mobile version