Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’ నుండి డబుల్ ట్రీట్.. ట్రైలర్‌తో పాటూ ఆ సర్ప్రైజ్ కూడా.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తుండగా,తాజాగా చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే ‘డబుల్ ట్రీట్’ ఇచ్చేందుకు సిద్ధమవుతోందట. భారీ వీఎఫ్ఎక్స్ (VFX) పనుల కారణంగా కొంత జాప్యం జరిగినప్పటికీ, ఇప్పుడు పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఒకేసారి పవర్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేస్తూ, దానితో పాటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి శ్రీరామనవమి (ఏప్రిల్ 6, 2026) రోజే ఈ అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించినప్పటికీ, ఇతర సినిమాల హడావిడి కారణంగా మెగా టీమ్ కొంచెం వెనక్కి తగ్గింది. దీంతో త్వరలోనే ఎటువంటి పోటీ లేని సమయంలో గ్రాండ్‌గా ఈ డబుల్ అనౌన్స్‌మెంట్ చేయాలని యువీ క్రియేషన్స్ భావిస్తోంది.
ఇక ఈ సినిమాలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చిరంజీవి – త్రిష కాంబినేషన్ మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయబోతుండగా. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండటంతో సాంగ్స్.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమా రేంజ్‌ను చెప్పకనే చెప్పగా, ఇప్పుడు రాబోయే ట్రైలర్ గనుక మెప్పిస్తే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఆ డబుల్ ట్రీట్ ఇచ్చే ఆ ముహూర్తం ఎప్పుడో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!