Site icon NTV Telugu

Chiranjeevi: గౌతమ్ రాజు లాంటి గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడం దురదృష్టకరం

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్‌రాజు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రాజు గారి లాంటి గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఆయన ఎంత సౌమ్యుడో, ఆయన ఎడిటింగ్ అంత వాడి అంటూ ప్రశంసించారు. ఆయన మితభాషి, కానీ ఆ యన ఎడిటింగ్ మెళకువలు అపరిమితం అంటూ చిరంజీవి కొనియాడారు.

ఎంత నెమ్మదస్తుడో, ఆయన ఎడిటింగ్ అంత వేగం అంటూ ఆయన సినిమా రంగానికి చేసిన సేవలను చిరు గుర్తు చేసుకున్నారు. ‘చట్టానికి కళ్ళు లేవు’ చిత్రం నుంచి ‘ఖైదీ నం 150’ వరకూ తన ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతంరాజు పనిచేశాడని తెలిపిన మెగాస్టార్.. ఆయన లేకపోవటం వ్యక్తిగతంగా తనకు, మొత్తం పరిశ్రమకి పెద్దలోటన్నారు. గౌతంరాజు కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

 

Exit mobile version