NTV Telugu Site icon

Bhola Shankar: మెగాభిమానులకు చిరంజీవి ఉగాది కానుక.. నెక్ట్స్ మూవీ అప్ డేట్

Bhola

Bhola

Bhola Shankar: ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సందడి చేసిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సినిమా సక్సెస్ అందుకున్న జోష్ లో మెగాస్టార్ ఉన్నారు. రూ.200 కోట్ల మార్కును అందుకొని మెగా బాస్ అంటే ఏమిటో చూపించాడు. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ చిరంజీవి నెక్ట్స్ మూవీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంలోనే ఆయన అభిమానుల కోసం ఉగాది సందర్భంగా ఓ స్వీట్ న్యూస్ ప్రకటించారు. ఆగస్ట్ 11, 2023న ‘భోళా శంకర్’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

Read Also: Afghanistan Earthquake: ఆఫ్ఘన్, పాక్‌లలో 11 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు..

‘భోళా శంకర్’ సినిమాకు స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తున్నారు, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో మెగా చిరంజీవి గ్రీన్ కుర్తా, షేడ్స్ లో హ్యాండ్సమ్ గా కనిపించారు. రాయల్ చైర్ లో కూర్చున కీర్తి సురేష్, తమన్నాలు సాంప్రదాయ దుస్తుల్లో ఉగాది పండుగ కళ ఉట్టిపడేలా అందంగా కనిపించారు. ఇప్పటికే విడుదలైన ‘భోళా శంకర్’ ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.