Site icon NTV Telugu

Varuntej – Lavanya: వైభవంగా వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థం

Lavanya Tripathi

Lavanya Tripathi

Varuntej – Lavanya: నాగబాబు వారసుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య నిశ్చితార్థం వైభవంగా జరిగింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో వీరి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మాత్రమే సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే.

Read Also: Delhi: జూలై 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ సినిమాలో వరుణ్, లావణ్య తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమాతోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ మరుసటి సంవత్సరం అంతరిక్షం సినిమాలో మళ్లీ కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి స్నేహం ప్రేమగా మారింది. అయితే చాలా కాలంగా వీరిద్దరూ తమ ప్రేమను గోప్యంగా ఉంచుతున్నారు. తమ రిలేషన్ షిప్ గురించి వచ్చిన వార్తలపై వారిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. వరుణ్ తేజ్ ప్రస్తుతం గాంధీవధారి అర్జున సినిమా చేస్తున్నాడు. సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుండగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు కొత్త దర్శకుడితో ఎయిర్ ఫోర్స్ కాన్సెప్ట్ సినిమా చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి ఇటీవల పులిమేక వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ-5లో ప్రసారమవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన లభించింది. గతేడాది హ్యాపీ బర్త్ డే సినిమాతో అలరించింది.

Read Also: Govinda Namalu: గోవింద నామాలు వింటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి

Exit mobile version