Site icon NTV Telugu

Kesineni Foundation: కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం!

Mp Kesineni Sivanath

Mp Kesineni Sivanath

కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మెగా ఉచిత వైద్య శిబిరం జరుగుతోంది. విజ‌య‌వాడ కేబీఎన్ కాలేజీలో ఉచిత మెగా మెడిక‌ల్ క్యాంప్‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ‘పశ్చిమ నియోజకవర్గంలో వెరికోస్ వెయిన్స్ స‌మ‌స్య‌తో ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్యాంపులో వెరికోస్ వెయిన్స్ స‌మ‌స్య‌పై నిపుణులైన వైద్యులు సేవలందిస్తున్నారు. ప్రజలందరూ ఉచిత మెగా మెడికల్ క్యాంపుని వినియోగించుకోవాలి’ అని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు.

అన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ ను ఎమ్మెల్యే సుజనా చౌదరి కోరారు. ‘ప్రతి 20 రోజులకు ఒకసారి ఈ క్యాంపు నిర్వహిస్తాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎక్కువగా మధ్య తరగతి ప్రజలు, పేద ప్రజలు ఉంటారు. కాబట్టి విజయవాడ ప్రజలు అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం త్వరలో ఒక మంచి హాస్పిటల్ నిర్మిస్తాం’ అని ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్పారు.

Exit mobile version