Mega 156 : భీమవరం దొరబాబుగా మెగాస్టార్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభం లోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం లో భోళా శంకర్ మూవీ తో ప్రేక్షకులను పలుకరించారు. ఆగష్టు 11 న రిలీజ్ అయిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో తన తరువాత సినిమా ను ఓ యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు మెగాస్టార్..’బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మెగా స్టార్ సినీ కెరీర్ లో ఈ సినిమా 156 వ చిత్రంగా రూపొందుతుంది.. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదొక భిన్నమైన అడ్వెంచర్ ఫాంటసీ సినిమా గా తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి విశ్వంభర అనే పేరు పరిశీలన లో వున్నట్లు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతుంది..
ఇందులో చిరంజీవి పాత్ర పేరు భీమవరం దొరబాబు అని సమాచారం. భీమవరం నేపథ్యం లో ఈ సినిమా మొదలవుతుందని, ఇందులో చిరంజీవి లుక్ ఎంతో డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం.దొరబాబు పాత్ర మంచి వినోదం తో కూడి ఉంటుదని తెలుస్తోంది.దొరబాబు పాత్ర నవ్వులుని పంచుతూనే మరో కొత్త ఊహా ప్రపంచానికి తీసుకెళుతుందని, విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా లో ప్రేక్షకులను అలరించే ఎలిమెంట్స్ చాలానే ఉంటాయని సమాచారం. సోషియా ఫాంటసీ నేపథ్యం లో సాగే ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.తాజాగా నేడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.క్లాప్ బోర్డు ను చూపిస్తూ మెగా 156 సెట్స్ మీదకు వచ్చిందని మేకర్స్ అధికారికం గా ప్రకటించారు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- France: మ్యూజిక్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటనలు.. సిరంజిలు గుచ్చి యువతులపై అత్యాచారాలు..
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు!
- Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
తాజావార్తలు
-
Realme P4x 4G: 8000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, 50MP కెమెరాతో.. రియల్మీ P4x 4G విడుదల
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
Aadhaar Rule Change from July 1: జూలై 1 నుంచి ఆధార్‌లో కీలక మార్పు.. ఈ సేవ పూర్తిగా ఉచితం!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
No Releases : ఈ సినిమాల విడుదలకు మోక్షం ఎప్పుడు..?
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!