NTV Telugu Site icon

Meetha Raghunath Marriage: పెళ్లి చేసుకున్న ‘గుడ్‌నైట్’ హీరోయిన్ మీతా రఘునాథ్!

Meetha Raghunath Marriage

Meetha Raghunath Marriage

Good Night Actress Meetha Ragunath Marriage: తమిళ యంగ్ హీరోయిన్ మీతా రఘునాథ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం మీతా తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయితో ఎడగులు వేశారు. ఇరు కుటుంబాలు, బంధువులు, స్నేహితుల సమక్షంలో మీతా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మీతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: LokSabha Elections 2024 : ఢిల్లీలో సీట్ల షేరింగ్.. ఆప్, కాంగ్రెస్ కలిసే పనిచేస్తాయి.. అది కూడా ఉమ్మడిగానే

‘ముత్తుల నీ నిధూమ్ నీ’ సినిమాతో తమిళ చిత్రసీమలోకి మీతా రఘునాథ్ ఎంట్రీ ఇచ్చారు. తోలి సినిమాలోనే కుర్రాళ్ళ మనసుని దోచేశారు. తన నటన, లుక్స్తో యువతను మెస్మరైజ్ చేశారు. ఇక గత ఏడాది వచ్చిన ‘గుడ్‌నైట్’ సినిమాతో స్టార్ అయ్యారు. ఈ సినిమాలో అను అనే పాత్రలో నటించి మెప్పించారు. వరుస సినిమాలతో బిజీ అవుతుందనుకునేలోపే.. గత నవంబర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు. ఇక ఆదివారం (మార్చి 18) వివాహం చేసుకున్నారు.

Show comments