అందాల భామ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈ భామ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”అనే మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైంది..ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ సరసన ‘ఖిలాడి’ మూవీ లో నటించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన ఈ అమ్మడి పెర్ఫార్మన్స్ అండ్ లుక్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.ఈ భామ గత ఏడాది అడివి శేష్‌తో నటించిన ‘హిట్ 2′ సినిమా తో మంచి విజయం అందుకుంది.తాజాగా..’గుంటూరు కారం’ మూవీ లో సూపర్ స్టార్ మహేశ్‌బాబు సరసన నటించింది..తన అందచందాలతో పాటు వరుస అవకాశాలను దక్కించుకుంటున్న ‘మీనాక్షి’ తన మనసులో మాటలు వెల్లడించింది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో నటించే అవకాశం వచ్చిందని తెలియగానే నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొదటిరోజు మొదటి షాట్ కూడా ఆయనతోనే..నేను చాలా టెన్షన్ పడ్డాను. నా భయాన్ని గమనించి.. టెన్షన్ పడొద్దనీ, కావాలంటే ఇంకొంత టైమ్ తీసుకోమని మహేశ్ ధైర్యం చెప్పారు. ఆ మాటలే నాలో భయాన్ని పోగొట్టాయి. ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అయితే నాకోసం నేను కొన్ని నియమాలు పెట్టుకున్నా. అందులో ముఖ్యమైంది‘నా కంఫర్ట్’. స్క్రిప్ట్ ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా కానీ ముందే చెప్పేస్తాను. ఈ కారణంగా నేను పెద్ద పెద్ద ప్రాజెక్టులను కూడా వదిలేసుకున్నాను.తెరపై ముద్దులకు సంబంధించి కూడా కొన్ని నియమాలు పాటిస్తాను.స్క్రిప్ట్ డిమాండ్ చేసి, మరీ అసభ్యకరంగా లేకుంటే వాటిని చేయడానికి నేను సిద్ధమే.. కానీ, కేవలం ముద్దు సీన్ల కోసమే అంటే మాత్రం నేను కచ్చితంగా వద్దని చెబుతాను.తెలుగు సినిమా పరిశ్రమ నా పట్ల ఎంతో ఆప్యాయత చూపుతున్నది. భాష ఏదైనా కానీ మంచి సినిమాలు చేయాలని నా కోరిక. అందుకోసమే ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాను.డబ్బు కంటే ముఖ్యంగా నేను చేసే పనికి ప్రశంసలతో పాటు గౌరవం దక్కాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపింది