ఒక్కప్పుడు భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు హీరోలతో జతకట్టి తనకంటూ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ లో మీనా ఒకరు. ఎన్నో ఏళ్ల కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మీనా, ఇప్పటికీ అదే గ్రేస్‌తో, అదే ఎనర్జీతో ఇండస్ట్రీలో యాక్టివ్‌గా కొనసాగుతున్నారు. కానీ సినిమాల విషయం పక్కన పెడితే ఈ మధ్య ఆమె తరచూ సోషల్ మీడియాలోనూ కనిపిస్తూ, తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యలు, కెరీర్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతుండటంతో మరోసారి అభిమానులకు దగ్గరవుతున్నారు. అయితే..
Also Read : iBomma Ravi : ఇమ్మడి రవి నాలుగో రోజు కస్టడీ విచారణలో కొత్త మలుపు.. కీలక క్లూస్ వెలుగులోకి
తాజాగా మీనా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం బయట పెట్టారు. “ప్రస్తుతం నేను నా పాపతో చాలా సంతోషంగా ఉన్నాను. ఆమె నా ప్రపంచం. నా శక్తి. నా శాంతి. కానీ బయట ప్రపంచంలో నా గురించి ఎంత మంది ఎన్ని రకాల వార్తలు పుట్టిస్తున్నారో చూస్తుంటే నవ్వొస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది మీనా. అలాగే ఆమెపై మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై ఫైర్ అయ్యారు. “ఏ హీరో విడాకులు తీసుకున్న వెంటనే.. అతనితో నాకు లింక్ పెట్టి స్టోరీస్ రాస్తున్నారు. ఆ హీరోతో నా పెళ్లి, రీ మ్యారేజ్ అంటూ ప్రాచారాలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే బాధగా అనిపిస్తుంది. ఈ రూమర్లలో ఒక్కటి కూడా నిజం కాదు. నా పర్సనల్ లైఫ్‌లో అలాంటి ఏమీ జరగడం లేదు” అని మీనా క్లారిటీ ఇచ్చారు.
మీనా తన కెరీర్ జర్నీ గురించి కూడా మాట్లాడారు. “పాప పుట్టిన తర్వాత నేను పూర్తిగా ఆమెకు టైం ఇచ్చారు. ఆ సమయంలో నాకు ‘దృశ్యం’ మలయాళ వెర్షన్ నుంచి ఆఫర్ వచ్చింది. మొదట నేను రిజెక్ట్ చేశా పాపను వదిలి షూటింగ్‌కి వెళ్లలేను అనిపించింది. కానీ కథ నాకు నచ్చడంతో చివరకు ధైర్యం చేసి ఆ సినిమా చేశాను. అదృష్టవశాత్తూ అది నాకు మరో పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఇప్పుడు నాకు వరుసగా మంచి స్క్రిప్టులు వస్తున్నాయి. నాకు నచ్చిన పాత్రలు, నన్ను ఛాలెంజ్ చేసే కథలు వస్తే ఇకముందు కూడా తప్పకుండా చేస్తాను” అని మీనా వివరించింది. మీనా ఈ మాటలు విన్న ఆమె అభిమానులు ఆమె నిజాయితీని అప్రిషియేట్ చేస్తున్నారు. మీనాను ఏ రూమర్లతోనూ కదిలించలేమని, ఆమె ఇంకా మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కామెంట్లు చేస్తున్నారు.
