NTV Telugu Site icon

Meena : సినీ నటి మీనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

Meenaa

Meenaa

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ మీనా.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన జోడి కట్టింది.. అయితే ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తుంది.. అయితే మీనా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీనా రాజకీయాల్లోకి రాబోతుందనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి..

సాదారణంగా సినీ రంగాల్లో ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు.. కొందరు సొంతంగా పార్టీని పెట్టి ప్రజాదారణ పొందుతూన్నారు.. ఈ క్రమంలో తాజాగా మీనా త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌ నిర్వహించిన పొంగల్‌ వేడుకలకు మీనాను ఆహ్వానించడంతో ఆమె రాజకీయ ప్రవేశం చేయనుందన్న వార్తకు బలం చేకూరింది. ఈ వేడుకలకు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో మీనాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న వార్త ఒకటి షికారు చేస్తుంది..

బీజేపీ నేతలతో కనిపించడం తో మీనా బీజేజీలో చేరబోతోందని, అందుకే ఆమెకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టుగా మీనా కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తిగానే ఉన్నట్టు మరో వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. ఏది ఏమైనా మరో సినీ సెలబ్రిటీలో పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతోందని జనాల్లో గుసగుసలు మొదలయ్యాయి.. దీనిపై త్వరలోనే క్లారిటి రావాల్సి ఉంది..