Site icon NTV Telugu

Medipally Murder: భార్య మృతదేహాం ముక్కలను మూసీ నదిలో పడవేసిన మహేందర్‌!

Mahender Reddy Swathi

Mahender Reddy Swathi

Medipally Murder Case Updates: బోడుప్పల్‌లోని బాలాజీ హిల్స్‌లో దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గర్భవతైన భార్య స్వాతి (25)ని భర్త మహేందర్‌ రెడ్డి అతి కిరాతకంగా చంపేశాడు. స్వాతి దారుణంగా చంపేసిన మహేందర్.. మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. కొన్ని శరీర భాగాలను కవర్‌లో ప్యాక్‌ చేసి బయట పడేశాడు. మిగతా మృతదేహా ముక్కలను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యగా దొరికిపోయాడు. నిందితుడు మహేందర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో ఉన్న మహేందర్‌ రెడ్డి తన భార్య స్వాతి మృతదేహా ముక్కలను మూసీ నదిలో పడవేసినట్లు చెప్పాడు. స్వాతి కాళ్లు, చేతులు, తల వేరు చేసి మూసీలో వేసినట్లు చెప్పాడు. మృతదేహా ముక్కల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతాప్ సింగారంలోని మూసి నది వద్ద పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహం విడిభాగాల గాలింపులో భాగంగా ప్రతాప్ సింగారం మూసికి ఇరువైపున పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహేందర్ తల్లిదండ్రులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు.

Also Read: CPL 2025: 46 ఏళ్ల వయసులో కూడా తగ్గేదేలే.. టీ20ల్లో 5/21 గణాంకాలు!

చెందిన స్వాతి, మహేందర్‌లది వికారాబాద్‌ మండలంలోని కామారెడ్డిగూడ. ఇద్దరిది పక్కపక్క ఇల్లులే. స్వాతి, మహేందర్‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్వాతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకుంటే.. కొన్ని నెలల క్రితమే ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్నారు. మహేందర్‌ సహా అత్తమామలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహేందర్‌ తల్లిదండ్రులు స్టేషన్ వెళ్లి.. కేసు కొట్టేపించారు. స్వాతిని ఆమె తల్లిదండ్రులతో ఫోన్ కూడా మాట్లానియ్యకపోయేవాడట. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే స్వాతిని హతమార్చి.. శరీరభాగాలను కవర్‌లో ప్యాక్‌ చేసి బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో.. పక్కింటి వారు ఇంట్లోకి వెళ్లి చూశారు. కవర్‌లో ఉన్న శరీర భాగాలను చూసి పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం బయటపడింది.

 

Exit mobile version