హైదరాబాద్ లోని మేడిపల్లిలో గర్భిణి అయిన భార్యను అనుమానంతో ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు భర్త మహేందర్ రెడ్డి. డెడ్ పార్ట్స్ ను మూసీలో పడేశాడు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలో స్వాతి సోదరి శ్వేత మహేందర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. NTV తో స్వాతి సోదరి శ్వేత మాట్లాడుతూ.. మహేందర్ రెడ్డి నన్ను కూడా వేధించాడు.. కాలేజీ కి వచ్చి నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు.. మా అక్కను హింసించి హత్య చేశాడు.. మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేసింది.
Also Read:Rajinikanth : టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఫిక్స్?
కాగా మేడిపల్లి స్వాతి పోస్టుమార్టం పూర్తి అయింది. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు.. స్వాతిని చంపిన మహేందర్ అరెస్ట్ అయ్యాడు. మహేందర్ ని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. మహేందర్ ని చర్లపల్లి జైలు కు తరలించారు. స్వాతి తల దొరకనందున డిఎన్ఏ కోసం శాంపిల్స్ ను ఎఫ్ఎస్ఎల్కు పంపించారు అధికారులు.. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడెంలో మహేందర్ రెడ్డి ఇంటి ముందు స్వాతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అంత్యక్రియలపై సందిగ్ధం నెలకొంది. స్వాతి మృతదేహానికి అంత్యక్రియలు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్వాతి కుటుంబసభ్యులు. ఇప్పటికే గ్రామం వదిలి వెళ్లారు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు.
స్వాతి హత్య కేసుతో రగిలిపోతున్న కామారెడ్డిగూడ
మహేందర్ రెడ్డి తీరుపై ఆగ్రహంతో మండిపడుతున్న గ్రామస్థులు.. ఇప్పటికే ఊరు వదిలి వెళ్లిన మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు.. గ్రామంలోకి మహేందర్ కుటుంబ సభ్యులను రానివ్వమంటున్న గ్రామస్తులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.
