Site icon NTV Telugu

Train Derail: బెంగాల్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన మేదినీపూర్-హౌరా ప్యాసింజర్

Medinipur To Howrah Passenger

Medinipur To Howrah Passenger

Train Derail: ఒడిశా తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో శనివారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. మేదినీపూర్ నుంచి హౌరా వెళ్తున్న లోకల్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఖరగ్‌పూర్‌లోకి ప్రవేశించే ముందు గిరి మైదాన్ వద్ద ఈ రైలు ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ప్రమాద స్థలికి చేరుకున్న రైల్వే అధికారులు కేసును పరిశీలిస్తున్నారు.

ఇటీవల జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇందులో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, SMVT బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్‌ రైలు ఢీకొన్నాయి. దీంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ సహా పలువురు అగ్రనేతలు సంతాపం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. దీంతో పాటు ఘటనాస్థలికి చేరుకున్న ప్రధాని మోడీ క్షతగాత్రులను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Read Also:Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లు ఫుల్..!

కూనూర్‌లో పట్టాలు తప్పిన రెండు కోచ్‌లు
ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక రైలు ప్రమాదాలు జరిగాయి. గురువారం (జూన్ 8) తమిళనాడులోని కూనూర్ ప్రాంతంలో ఊటీ నుంచి మెట్టుపాళయం వెళ్తున్న రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ప్రయాణికులెవరూ ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ రైలు ప్రమాదం కూడా జరిగింది

జబల్‌పూర్‌లో గూడ్స్ రైలు రెండు కోచ్‌లు
మంగళవారం (జూన్ 6) మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో గూడ్స్ రైలుకు చెందిన రెండు ట్యాంకర్ కోచ్‌లు పట్టాలు తప్పాయి. పశ్చిమ మధ్య రైల్వే కథనం ప్రకారం.. భిటోని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రైలు ప్రమాదంలో కూడా ఎవరూ చనిపోలేదు.

Read Also:John Kaczynski: 17 ఏళ్లలో 16 పేలుళ్లు.. జైల్లోనే చనిపోయిన అమెరికా క్రూర నేరస్థుడు

Exit mobile version