Site icon NTV Telugu

Medical College For Nirmal : నిర్మల్‌లో మెడికల్‌ కళాశాల మంజూరు.. జిల్లాలో సంబరాలు

Ts Gov Logo

Ts Gov Logo

నిర్మల్‌ జిల్లాకు రూ.166 కోట్ల అంచనా వ్యయంతో 100 పడకల వైద్య కళాశాలను మంజూరు చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సౌకర్యం కల్పించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న జిల్లా ప్రజలకు ప్రభుత్వ నిర్ణయం సంతోషాన్ని కలిగించింది. జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు ఐదు దశాబ్దాలుగా వచ్చిన ప్రభుత్వాలను కోరుతున్నారు. కానీ, వారి కల నెరవేరలేదు. అయితే, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను గుర్తించిన ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రాసుపత్రి ఆవరణలో 25 ఎకరాల స్థలంలో వైద్య కళాశాలను నెలకొల్పనున్నారు. నిర్మల్ కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో వేగంగా అడుగులు వేస్తోంది. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కృషికి ధన్యవాదాలు తెలిపారు ప్రజలు. 250 పడకల జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రి ఇప్పటికే నిర్మాణంలో ఉంది.

 

ఈ సదుపాయానికి రూ.40 కోట్లు ఖర్చవుతుందని అంచనా. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్, రేడియాలజీ ల్యాబ్, పాలియేటివ్ కేర్ వింగ్‌లను ఏర్పాటు చేశారు. నిర్మల్ పట్టణానికి చెందిన ఉమా మహేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఆర్థికంగా పేద ప్రజలకు త్వరలో జిల్లా కేంద్రంలో నాణ్యమైన వైద్యసేవలు అందుతాయని అన్నారు. ప్రస్తుతం తాము నిజామాబాద్, హైదరాబాద్ నగరాలపై ఆధారపడాల్సి వస్తోందని, భారీ మొత్తంలో గుల్ల చేసి ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందని గుర్తు చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో నిర్మల్‌లో అపూర్వమైన మార్పు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. 3,845 చదరపు కిలోమీటర్లలో విస్తరించి, 709,418 జనాభా కలిగిన నిర్మల్‌లో 19 రెవెన్యూ మండలాలు మరియు 420 గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి, రెండు ఏరియా ఆసుపత్రులు, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 110 ఉప కేంద్రాలు, 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆసుపత్రుల్లో 300 పడకలు, 60 మంది వైద్యులు ఉన్నారు.

 

Exit mobile version