Site icon NTV Telugu

Job Notifications: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Jobs

Jobs

నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రేవంత్ సర్కార్ కృషి చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1,2,3, డీఎస్సీ ల ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టగా తాజాగా ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. హెల్త్ డిపార్ట్ మెంట్ లో మరోసారి భారీగా జాబ్స్ భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆరోగ్యశాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెల జీతం రూ.68,900-రూ.2,05,500 మధ్య ఉంటుంది.

Also Read:Ahmedabad Plane Crash: దర్యాప్తు అధికారికి ముప్పు.. ఎక్స్‌ కేటగిరీ భద్రత కేటాయింపు

రెండ్రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 10 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసింది. మరో 2322 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్టసిస్ట్‌, 1284 ల్యాబ్ టెక్నీషియన్, 1931 మల్టి పర్పస్ ఫీమెల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలు విడుదల కాగా మెరిట్ జాబితాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.

Exit mobile version