Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీ ఎన్నికల ఫలితాలు.. పందెం రాయుళ్లకు ఊహించని ఝలక్..!

Betting

Betting

Andhra Pradesh: పందాలకు కేరాఫ్ గా ఉంటే భీమవరంలో ఈసారి పందెం రాయుళ్లకు ఊహించని ఝలక్ తగిలింది. ఎన్నికల ఫలితాలపై కోట్లను సంపాదిద్దామనుకొని బెట్టింగ్ రాయుళ్లు పెద్ద స్థాయిలో పందాలు కాసారు. పందాల కాసే ఇరువురు వ్యక్తులు డబ్బులు మధ్యవర్తి వద్ద ఉంచడం అనేది సహజం. పందెం గెలిచిన తర్వాత మధ్యవర్తి తన కమిషన్ తీసుకుని మిగిలిన పందెం డబ్బులు గెలిచిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఇదే పద్ధతిలో భీమవరానికి చెందిన ఓ మధ్యవర్తి వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన బెట్టింగ్ రాయుళ్ళు పెద్ద మొత్తంలో అనేకమంది మధ్యవర్తుల వద్ద డబ్బులు కలిపారు. ఇదే తరహాలో భీమవరం సమీపంలో రాయలం గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద ఇరు పార్టీల పందం రాయుళ్ళ పెద్ద మనిషిగా ఉంచారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు చెందిన పందెం రాయుళ్ళు బెట్టింగ్ కోసం తెచ్చిన డబ్బును సదరు మధ్యవర్తి దగ్గర ఉంచి గెలిచిన తర్వాత 5 పర్సెంట్ కమిషన్ తీసుకుని పందెంలో నెగ్గిన వ్యక్తికి మిగతా డబ్బులు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు.

ఇలా మొత్తం సుమారు 30 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయలపైనే ఆ మధ్యవర్తి వద్ద పందాలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత పందాల్లో గెలిచిన వ్యక్తులు తమకు డబ్బులు వస్తాయని ఆనందంలో మునిగితేలారు.. ఎంతో ఆశగా పందెంలో గెలిచిన డబ్బు కోసం మధ్యవర్తి వద్దకు వెళ్తే ఆ మీడియేటర్ కాస్త అడ్రస్ లేకుండా పోయాడు. దాంతో అతను ఎక్కడికి వెళ్ళాడా అని ఆరా తీశారు. కానీ, అతను ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించారు. మధ్యవర్తి బంధువులు కుటుంబ సభ్యులు సైతం అతని గురించి సమాచారం తెలియదు అన్నట్లుగా వ్యవహరించడంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పందెం రాయుళ్లు గగ్గోలు పెడుతున్నారు.

ఒకవేళ పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయాలన్న పందెం కాయడం చట్ట వ్యతిరేకం. అందుకే ఫిర్యాదు చేస్తే తమపైనే కేసులు నమోదు చేస్తారేమో అని భయపడుతున్నారు. పందాలు కాసిన వారంతా ఒక గ్రూపుగా ఏర్పడి ఆ మధ్యవర్తి కోసం వెతుకులాట మొదలుపెట్టారట. మధ్యవర్తి అడ్రస్ దొరికిన అతని నుంచి డబ్బులు వస్తాయా లేదా అనే ఆందోళనలో పందెం రాయుళ్ళు గగ్గోలు పెడుతున్నారు. పందాలుకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి పరారవడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే తరహాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాలలో కోట్లాది రూపాయలు పందాలు జరిగాయి. పందెం డబ్బులు రాకపోతే రాకపోయే అసలు డబ్బులు అయినా వస్తాయా లేదా అని భయం ఇప్పుడు పందెం రాయుళ్లను వెంటాడుతోంది.. ఇందులో అనేకమంది పొలాలు బంగారం తాకట్టు పెట్టు మరి డబ్బు తీసుకువచ్చి మధ్యవర్తులు వద్ద కలిపారు. కనీసం అసలైన వస్తే వాటిని బయటకు తెచ్చుకోవచ్చని ఆశతో ఎదురుచూస్తున్నారు. బెట్టింగ్ రాయల డబ్బుతో ఊడయించిన మధ్యవర్తికి రాజకీయ అండదండలు ఉండడంతో ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్ల పరిస్థితి అయోమయంగా తయారయింది.

Exit mobile version