Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?

  • ఉమెన్స్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026..
  • మెధావి బిధూరి ‘6-7’ సెలబ్రేషన్‌తో సోషల్ మీడియాలో వైరల్‌
  • ఆగస్టు 20న చేసిన ఈ ప్రత్యేక సెలబ్రేషన్‌..
  • ఆమె 67 నంబర్ జెర్సీ మరింత క్రేజ్..
Medhavi Bidhuri

Medhavi Bidhuri

Medhavi Bidhuri: గత వారం రోజుల నుండి క్రికెట్ అభిమానులకు మరో కొత్త క్రష్ దొరికింది. ఆమెవరో కాదు.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన యువ క్రికెటర్, ఉమెన్స్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026 (DPL) ప్లేయర్ మెధావి బిధూరి. ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె వార్తల్లోకి రావడానికి కారణం వైరల్ ‘6-7’ సెలబ్రేషన్ కాదు.. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన. తాజాగా జరిగిన సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్, సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన మెధావి.. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది.

‘6-7’ సెలబ్రేషన్‌తో ఓవర్‌నైట్ స్టార్..

ఆగస్టు 20న టోర్నీలో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెధావి బిధూరి వికెట్ తీసిన అనంతరం చేసిన ‘6-7’ జెన్ జీ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అదే మ్యాచ్‌లో ఆమె జెర్సీ నంబర్ కూడా 67 కావడంతో ఈ సెలబ్రేషన్‌కు మరింత క్రేజ్ వచ్చింది. ఈ ప్రత్యేక సెలబ్రేషన్ ఆలోచన తన చెల్లెలిదేనని 20 ఏళ్ల మెధావి మ్యాచ్ తర్వాత వెల్లడించారు. తన చెల్లెలే 67 నంబర్ జెర్సీ ధరించాలని, ట్రెండింగ్‌లో ఉన్న ‘6-7’ సెలబ్రేషన్ చేయాలని సూచించిందని తెలిపారు. దీంతో మహిళల డబ్ల్యూడీపీఎల్ 2026లో మెధావి ఒక్కసారిగా అత్యంత వైరల్ ప్లేయర్లలో ఒకరిగా మారారు.

ఆటలోనూ సత్తా..

సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీకి తగ్గట్టుగానే మెధావి బిధూరి మైదానంలోనూ తన ప్రతిభను చూపిస్తున్నారు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ జట్టు బ్యాటర్ తానిషా సింగ్‌ను ఔట్ చేసిన మెధావి.. మొత్తం రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ తొలుత 68 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ జట్టు 57/5 పరుగులకే పరిమితమైంది. దీంతో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వికెట్ల జాబితాలో అగ్రస్థానం..

ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడంతో మెధావి బిధూరి టోర్నీలో తన వికెట్ల సంఖ్యను నాలుగుకు చేర్చుకున్నారు. దీంతో డబ్ల్యూడీపీఎల్ 2026లో ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆమె అగ్రస్థానంలో నిలిచారు. వైరల్ సెలబ్రేషన్‌తో మాత్రమే కాకుండా బౌలింగ్ ప్రదర్శనతోనూ ఆకట్టుకుంటూ టోర్నీలో చూడాల్సిన ప్లేయర్లలో ఒకరిగా మారింది.

రీక్రియేట్ చేసిన చాహల్..

మెధావి బిధూరి ‘6-7’ సెలబ్రేషన్‌కు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ వచ్చిందో చెప్పడానికి మరో ఉదాహరణ టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న చాహల్ కూడా మెధావి వైరల్ సెలబ్రేషన్‌ను రీక్రియేట్ చేశారు. దీంతో మెధావి చేసిన ప్రత్యేక సెలబ్రేషన్‌కు మరింత వైరల్ అయ్యింది. ఇలా ఒకవైపు ‘6-7’ సెలబ్రేషన్‌తో సోషల్ మీడియాను ఆకట్టుకున్న మెధావి.. మరోవైపు వరుసగా వికెట్లు తీస్తూ తన క్రికెట్ ప్రతిభను కూడా నిరూపించుకుంటుంది.