Site icon NTV Telugu

Hyderabad: మేడ్చల్‌లో దారుణం.. మద్యం మత్తులో తండ్రిని హత్య చేసిన కన్న కొడుకు..

Rayachoty Murder

Rayachoty Murder

Hyderabad: మేడ్చల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రిని కన్న కొడుకే హత్య చేసిన ఘటన స్థానికులను కలచివేసింది. మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి ఈ దారుణం వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్‌ ప్రస్తుతం మేడ్చల్‌లో నివసిస్తున్నాడు. అతని కుమారుడు షేక్‌ సాతక్‌ తన స్నేహితుడు రాజుతో కలిసి మంగళవారం రాత్రి మద్యం సేవించాడు. అనంతరం మద్యం మత్తులో తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం హత్యకు దారితీసింది. ఆగ్రహంతో కుమారుడు బండరాయితో తండ్రిపై దాడి చేసి దారుణంగా హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, నిందితుడు షేక్‌ సాతక్‌తో పాటు అతని స్నేహితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది.

READ MORE: Dhruv : నాకు తెలుగులో నటించాలని ఉంది..

Exit mobile version