NTV Telugu Site icon

Medaram Jatara: నేడు సమ్మక్క- సారలమ్మ వన ప్రవేశం.. అమ్మవార్ల దర్శనానికి భారీగా భక్తులు

Medaram

Medaram

నాలుగు రోజులుగా కొనసాగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. నేడు వన దేవతలు వన ప్రవేశంతో జాతర ముగియనుంది. నేటి సాయంత్రం పూజారులు గద్దెల దగ్గరకు వచ్చి సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత వన దేవతల వన ప్రవేశం స్టార్ట్ అవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయ్ గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ఈ కార్యక్రమంతో జాతర ముగుస్తుంది.

Read Also: XMail : ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం.. జీ మెయిల్ కు పోటీగా ఎక్స్ మెయిల్

ఈ క్రమంలో మేడారం జాతరకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తజనం క్యూలైన్లలో వేచి ఉన్నారు. గద్దెల పరిసరాలన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మూడు రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు చివరి రోజైనా వచ్చి దర్శనాలు చేసుకోవాలని వస్తున్నారు. తల్లుల వన ప్రవేశం సమయంలో కొంతసేపు దర్శనాలను నిలిపి వేసినా మళ్లీ యథాతథంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. రెండేళ్లకోసారి అమ్మవార్లను దర్శించుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. అలాగే, ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా.. దర్శనం మాత్రం బాగా జరుగుతుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.