NTV Telugu Site icon

Mechanic Rocky: షేప్ అవుట్ చేసుడే కాదు.. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు.. అదరగొట్టిన విశ్వక్

New Project (30)

New Project (30)

Mechanic Rocky: ఇటీవల కాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు విశ్వక్ సేన్. త్వరలో మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ మెకానిక్ రాకీతో రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ ఎస్ ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో వస్తున్న మెకానిక్ రాకి టీజర్ రిలీజ్ అయి అద్భుతమైన స్పందన అందుకుంది. షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా నవంబరు 22న రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా ఆల్రెడీ ఓ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు.

Read Also:Hemant Soren: నాపై అసత్య ప్రచారానికి బీజేపీ రూ.500 కోట్లు ఖర్చు చేసింది..

‘మెకానిక్ రాకీ’ మొదటి ట్రైలర్లో హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్లు శ్రద్దా శ్రీనాథ్, మీనాక్షి చౌదరిల పాత్రలను పరిచయం చేయడానికి సరిపోయింది. మీనాక్షి చౌదరి పాత్ర వెంట పడుతూ హీరో చేసే కామెడీని హైలెట్ చేశారు. విలన్, హీరో పాత్రలను కూడా పరిచయం చేశారు. అయితే ఈ రెండో ట్రైలర్ లో.. కథలోని ఎమోషన్ ని చూపెట్టారు. హీరో మెకానిక్ షాప్ స్థలం కోసం.. అతని తండ్రి విలన్ ను వేధించడం.. తర్వాత ఆ షెడ్డుని కూల్చివేయడం.. దాని కోసం హీరో విలన్ సునీల్ తో ఎలా ఫైట్ చేశాడన్న పాయింట్ ను టచ్ చేస్తూ ట్రైలర్ ని కట్ చేశారు. విశ్వక్ సేన్ మార్క్ మాస్ డైలాగ్స్ ఇందులో ఉన్నాయి. ‘షేప్ అవుట్ చేసుడే కాదు.. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు’ ‘బూట్ కాలితో తంతే ఉత్త కాలు బయటకు వచ్చేస్తది’ వంటి డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. విలన్ గా సునీల్ (Sunil) లుక్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమాతో విశ్వక్ తన ఖాతాలో మరో హిట్ వేసుకునేట్లు కనిపిస్తోంది.

Read Also:Cinema Special : బడా మూవీస్ వల్ల నిర్మాతలు చితికిపోతున్నారా..?

Mechanic Rocky Trailer 2.0 | Vishwaksen | Meenakshi | Shraddha | Ravi Teja M | JakesBejoy |Rajani T