Site icon NTV Telugu

NO Meat : హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. రేపు మటన్‌, చికెన్‌ బంద్‌

Meat Shop

Meat Shop

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని అన్ని గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలు, రిటైల్ మాంసం, గొడ్డు మాంసం దుకాణాలను జనవరి 30న మూసివేయనున్నారు. ఈ క్రమంలో, ఉత్తర్వులను అమలు చేయడంలో మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సహకారం అందించడానికి సంబంధిత అధికారులను ఆదేశించాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ GHMC పరిధిలోకి వచ్చే మూడు పోలీసు కమిషనరేట్‌లను అభ్యర్థించారు.

ఇదిలా ఉంటే.. జీఓ ఎంఎస్‌ నెం 59 ప్రకారం ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి లేఅవుట్‌కు అనుమతులు ఇవ్వరాదని, భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా, జీఓ 59 దరఖాస్తులు, కన్వేయన్స్ డీడ్‌ల రీ వెరిఫికేషన్‌ను చేపట్టాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఆగస్టు 17న లేదా ఆ తర్వాత అమలు చేసిన కన్వేయన్స్ డీడ్‌లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.

Exit mobile version