Site icon NTV Telugu

Vijayawada: మళ్ళీ ఎంబీబీఎస్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ కలకలం.. పట్టుబడ్డ ఇద్దరు విద్యార్దులు

Mbbs

Mbbs

సిద్దార్ధ వైద్య కళాశాలల్లో మళ్ళీ ఎంబీబీఎస్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ కలకలం రేపింది. గత బుధవారం జనరల్ మెడిసిన్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డ ముగ్గురు విద్యార్ధులు. శనివారం కమ్యూనిటీ మెడిసిన్ (పార్ట్ 1) పరీక్ష రాస్తూ ఇద్దరు విద్యార్ధులు పట్టుబడ్డారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన విద్యార్దులను ఎన్నారై, నిమ్రా కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. 160 మంది విద్యార్దులు పరీక్ష రాస్తుండగా ఇద్దరు పట్టుబడ్డారు.

Also Read:Anupama : ఆ రెండు విషయాల్లో మాత్రం ఒత్తిడికి గురవుతా..

గత బుధవారం ఘటనతో యునివర్సిటీ స్పెషల్ స్క్వాడ్ ను రంగంలోకి దించింది. స్క్వాడ్ తనిఖీల్లో స్లిప్పులతో దొరికిపోయారు ఇద్దరు విద్యార్ధులు. విద్యార్ధుల జవాబు పత్రాలను, గుర్తింపు కార్డులను ఇన్విజిలెటర్లు స్వాధీనం చేసుకున్నారు. జవాబు పత్రాలను మాల్ ప్రాక్టీస్ కమిటీకి అధికారులు పంపించారు. ఈ నెల 21వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. వరుస మాల్ ప్రాక్టీసు ఘటనలతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

Exit mobile version