NTV Telugu Site icon

Kaloji Health University : నేటి నుంచి ఎంబీబీఎస్‌ తొలి విడత ప్రవేశాలు

Kaloji Health University

Kaloji Health University

తెలంగాణలోని వైద్య విద్య కోర్సు విద్యార్థులకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుభవార్త చెప్పింది. ఎంబీబీఎస్‌ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం. అయితే.. ఈ నేపథ్యంలో నేడు తొలి విడత విద్యార్థులు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చుని తెలిపింది కాలోజీ హెల్త్‌ యూనివర్సిటీ. అయితే.. ఉదయం ఉదయం 6 గంటల నుంచి నవంబరు 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించినట్లు కాలోజీ హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Also Read : Delivery in an Ambulance : కదిలే రైలులో గర్భణీకి పురిటి నొప్పులు.. అంబులెన్స్‌లో ప్రసవం

అయితే.. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు మాత్రమే ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కాలోజీ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు కాలోజీ హెల్త్‌ యూనివర్సిటీ పేర్కొంది. కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపచినట్లు, పూర్తి వివరాల కోసం www.knrhs. telangana. gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది కాలోజీ హెల్త్‌ యూనివర్సిటీ.