Casting Call: ‘మయసభ’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను విభిన్న అనుభూతిని పంచిన క్రియేటివ్ టీమ్ ఇప్పుడు ఈ మ్యాజిక్‌ను వెండి తెరపైకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు దేవ కట్ట సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు లియో కిరణ్.. కథ, మాటలు, దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ కృష్ణ లిన్, శ్రీహర్ష వాడ్ల సంయుక్తంగా హిట్‌మెన్, ప్రూడోస్ ప్రొడక్షన్స్ LLP బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం తాజాగా చిత్ర బృందం కాస్టింగ్ కాల్ ప్రకటించింది. ఇందులో నటించడానికి ఫీమేల్ లీడ్ (వయసు 16–24 సంవత్సరాలు) తో పాటు అన్ని వయసుల సపోర్టింగ్ రోల్స్ కోసం నటీనటులను ఆహ్వానిస్తున్నారు. తప్పనిసరి అందరికీ రాయలసీమ భాషా అనేది అర్హతగా పేర్కొన్నారు. ఆసక్తిగల నటీనటులు తమ ప్రొఫైల్స్‌ను hitprocasting@gmail.com కు పంపించాలని సూచించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను @hitmenmediawork, @n_nynthri సోషల్ మీడియాలో ఫాలో కావాలని చెప్పారు.
READ ALSO: LVM3-M5 Rocket: ఆకాశంలో ఆపరేషన్ సింధూర్ 2.0 ..
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒకప్పుడు స్నేహితులన్న సంగతి అందరికీ తెలుసిందే. కాంగ్రెస్ పార్టీలో వీరిద్దరూ ఒకే సమయంలో మంత్రులుగా కూడా పనిచేశారు. వీరిద్దరి స్నేహాన్ని ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు దేవా కట్టా ఇటీవల మయసభ అనే సిరీస్ రూపొందించారు. అయితే లీగల్ ఇష్యూస్ తలనొప్పులు ఎందుకనుకున్నారో ఏమోగానీ ఆయన తన సిరీస్‌లో పూర్తిగా వారి పేర్లను మార్చేయడమే కాదు, సిరీస్ మొత్తం ఒక కల్పిత కథలాగా ఆవిష్కరించారు. ఈ విషయం ట్రైలర్ చూసిన వారందరికీ అర్థమైపోతుంది. తాజాగా ఈ సిరిస్‌ను వెండి తెరపై ఆవిష్కరించడానికి క్రియేటివ్ టీమ్ నుంచి కాస్టింగ్ కాల్ రావడంతో సినీ ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది.
READ ALSO: Kasibugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై అసలు కారణం అదే.. మంత్రి ఆనం వివరణ..