Mayanmar Refugees: మనిషి కోరుకునేది రెండు పూటలా జానెడు పొట్టకు పిడికెడు ఆహారం. దాని కోసమే మనిషి నానాయాతన పడుతుంటారు. అయితే ఆ పూట కడుపు నింపే అన్నదానం కంటే అన్ని పూటలా కడుపు నింపే విద్యాదానం చాల గొప్పది. అందుకే ప్రస్తుతం దారిద్రరేఖకు దిగువున ఉన్నవాళ్లు అధికారంలో ఏ పార్టీ ఉన్న మాకు నిత్యావసరాలైన కూడు, విద్యను సమకూరిస్తే చాలు అని వేడుకుంటున్నారు. వివరాలలోకి వెళ్తే.. మణిపూర్ లో అల్లర్లు రేకెత్తిన తరుణంలో అక్కడ నివసించే కుకీల్లో చాలామంది మిజోరాం రాష్ట్రానికి శరణార్థులుగా వచ్చారు. ప్రస్తుతం మిజోరంలో 31000 వేల మంది మయన్మార్ శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మిజోరంలో ఆశ్రయం పొందిన మయన్మార్ శరణార్థులు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం లోకి వచ్చిన తమకు నిత్యావసరాలను సమకూరిస్తే చాలని పేర్కొంటున్నారు.
Read also:Gadikota Srikanth Reddy: నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటినే జిల్లా కేంద్రం..
గౌరవంగా బ్రతికేల రెండు పూటలా భోజం, పిల్లలకు మంచి విద్యను అందిస్తే చాలని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తమకు ఎంతోగానో సహాయపడుతుందని.. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం లాగానే కనీస అవసరాలను తీర్చేలా, ఉపాధిని కలిగించేలా మద్దతు
ఇవ్వాలని కోరుకుంటున్నారు. మిజోరంలో ఉన్న మయన్మార్ శరణార్ధులకు ప్రస్తుతం ఉన్న అధికార ప్రభుత్వం కనీస సదుపాయాలను కల్పిస్తోంది. అలానే 8119 మంది శరణార్ధుల పిల్లలు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. కాగా స్థానిక విద్యార్థులతో పాటుగా మయన్మార్ శరణార్థ విద్యార్థులకు కూడా ఉచితంగా యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, మధ్యాహన భోనజన సదుపాయం కల్పించారు.