Site icon NTV Telugu

IPL 2025: లక్నో సూపర్‌ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్.. జట్టులో చేరిన పేస్ సంచలనం!

Mayank Yadav Lsg

Mayank Yadav Lsg

లక్నో సూపర్‌ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్. పేస్ సంచలనం మయాంక్ యాదవ్ ఎట్టకేలకు ఫిట్‌నెస్‌ సాధించి జట్టుతో కలిశాడు. శనివారం (ఏప్రిల్ 19) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో మయాంక్ ఆడే అవకాశం ఉంది. మయాంక్ రాకతో లక్నో బౌలింగ్ బలం మరింత పెరిగింది. పేసర్లు శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేశ్ ఖాన్‌లకు మయాంక్ తోడవ్వనున్నాడు. మయాంక్ తుది జట్టులోకి వస్తే.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్న శార్దూల్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.

2024 ఐపీఎల్‌లో లక్నో తరఫున ఆడిన మయాంక్‌ యాదవ్‌.. బుల్లెట్ లాంటి బంతులతో అందరిని ఆకట్టుకున్నాడు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులేశాడు. అయితే గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌లే ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో మయాంక్‌ను రూ.11 కోట్లకు లక్నో రిటైన్ చేసుకుంది. ఇటీవలి గాయాల నుంచి కోలుకున్న మయాంక్‌.. ఐపీఎల్ 2025లో ఆడేందుకు సిద్ధమవుతుండగా మునివేళ్లకు గాయమైంది. మరలా సెంటర్ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు వెళ్లి తాజాగా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. మయాంక్ రాకతో లక్నో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025లో లక్నో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి.. నాలుగు విజయాలు, మూడు ఓటములను ఎదుర్కొంది.

Exit mobile version