NTV Telugu Site icon

Charges On Phone number: ఇకపై ఫోన్‌ నంబర్‌కూ ఛార్జీ.. ట్రాయ్‌ కొత్త సిఫార్సు..?

Phone Number

Phone Number

ఫోన్ వాడే కోట్లాది మంది భారతీయులపై మరో అదనపు భారం పడబోతోంది. ఇందుకు సంబంధించి కేంద్రం రంగాన్ని సిద్ధం చేస్తోంది. కొద్దీ రోజుల క్రితం సిమ్ కార్డు పొందేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉండేది. ఆపై టెలికాం కంపెనీల మధ్య పోటీ వల్ల ప్రతి కంపెనీ ఉచితంగా సిమ్ కార్డులు జారీ చేసాయి. ఇంకేముంది మన దేశంలో చాలా మంది ఉచితం అంటే చాలు.. అమాంతం ఎగబడి పోతారు. ఇదే ఆలచనలో చాలా మంది ఇష్టానుసారం సిమ్ కార్డులు తీసుకుని, కంపెనీలు అందించిన ప్రయోజనాలు వాడుకున్నాక పక్కన పడేసేవారు.

Andhra Pradesh: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కార్.. అప్పటి నుంచే పెంచిన పెన్షన్‌ అమలు..

ఈ నేపథ్యంలో కొన్నాళ్లకు.. ప్రతి ఒక్కరికి ఫోన్ నంబర్ల జారీపై గరిష్ఠ పరిమితి విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ దెబ్బతో ఈ తరహా దుర్వినియోగం బాగా తగ్గిందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) కొత్త సిఫార్సులను సిద్ధం చేసింది. అందులో ఫోన్ నంబర్లకు, ల్యాండ్ లైన్ నంబర్లకూ ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది ట్రాయ్. ఇందుకు గాను ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది.

International Yoga Day 2024: ఎత్తు పెరగాలంటే ఈ మూడు ఆసనాలు ట్రై చేయండి

ఇదేకాని నిజమైతే., ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం చేస్తే మొబైల్ ఆపరేటర్ల నుంచి తొలుత ఈ ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఆపై కంపెనీలు వినియోగదారుల నుంచి రికవరీ చేసుకునే అవకాశం కనపడుతుంది. ఫోన్ నంబర్లు సహజ వనరుల మాదిరిగానే కూడా చాలా విలువైనవిగా అని ట్రాయ్ భావిస్తోంది. ఈ చేతనే కాస్త ఛార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.